ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చిస్తున్న సమయంలో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భారత యువత వారానికి 72 గంటలు పనిచేయాలని సూచించడం అలాగే రీసెంట్ గా చైనాలో ప్రసిద్ధి చెందిన 996 రూల్ ను ఉదాహరణగా చూపడం మరోసారి చర్చకు దారి తీసింది. అసలు 996 విధానం అంటే ఏంటి? ఇది ఎలా మొదలైంది? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం.
996 రూల్ అంటే..
996 రూల్ అనేది చైనాలోని టెక్ కంపెనీలు, స్టార్టప్‌ల కంపెనీలలో అనధికారికంగా అమలయ్యే ఒక కఠినమైన పని విధానం. 996 అంటే.. ఉదయం 9 గంటలకు పని మొదలుపెట్టి రాత్రి 9 గంటల వరకు పని చేయాలి. ఇలా వారంలో 6 రోజులు పని చేయాలి. ఈ మోడల్ ప్రకారం ఉద్యోగులు వారానికి దాదాపు 72 గంటలు (రోజుకు 12 గంటలు × 6 రోజులు) పనిచేయాల్సి ఉంటుంది.
ఇలా మొదలైంది
చైనాలో 2010 కాలంలో అలీబాబా, హువావే వంటి ఐటీ, ఇంటర్నెట్ కంపెనీలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఆ సమయంలో పోటీని తట్టుకోవడానికి కంపెనీలు త్వరగా లక్ష్యాలను చేరుకోవడానికి ఈ విధానాన్ని మొదలుపెట్టాయి. జాక్ మా వంటి కొంతమంది వ్యాపారవేత్తలు కూడా దీన్ని అప్పట్లో సమర్థించారు.

వివాదం ఎందుకు అయింది?
ప్రపంచవ్యాప్తంగా వర్క్ కల్చర్ లో 996 విధానం అత్యంత వివాదాస్పదంగా పరిగణించబడుతుంది. దీనికి ప్రధాన కారణాలు ఉద్యోగులపై ఉండే శారీరక, మానసిక ఒత్తిడి. వారానికి 72 గంటలు పనిచేయడం వల్ల ఉద్యోగులు తీవ్రమైన అలసట, ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. పనిచేస్తూనే కుప్పకూలిన సందర్భాలు కూడా గతంలో నమోదయ్యాయి.
మరొక ముఖ్యమైన కారణం తమ కుటుంబం, స్నేహితుల కోసం సమయం కేటాయించలేకపోవడం. ఈ పని విధానం వల్ల గతంలో చాలామంది పెద్ద నగరాలను విడిచి వెళ్లిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇకపోతే ఈ పని విధానం చైనా కార్మిక చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తుంది. కంపెనీలు అనధికారంగా ఈ విధానాన్ని అమలు చేసేవి. అందుకే ఈ నియమం అప్పట్లో వివాదాస్పదం అయింది. ఈ విధానంపై ఉద్యోగుల నిరసనలు, ఆన్‌లైన్ ఉద్యమాల వంటివి పెరగడంతో చివరికి 2021లో చైనా అత్యున్నత న్యాయస్థానం 996 పని విధానాన్ని చట్టవిరుద్ధం అని ప్రకటించింది.
నారాయణ మూర్తి ఉద్దేశం ఏంటి?
ఇకపోతే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గతంలో భారత యువత వారానికి 70 గంటలు పనిచేయాలని కోరినప్పుడు కూడా పెద్ద వివాదం జరిగింది. తాజాగా, ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ చైనాలోని 996 ను ఉదాహరణగా చూపారు. అయితే భారతదేశం ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే ప్రొడక్టివిటీ పెరగాలి అని చెప్పడం ఆయన ఉద్దేశం అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications