Nandan Nilekani: దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు నందన్ నీలేకని. కేంద్రం తీసుకొచ్చిన అందరికీ ఆథార్ ప్రాజెక్టును విజయవంతం చేయటంలో ఆయన కృషి చాలా కీలకమైనది.
అయితే తాజాగా ఆయన ఐఐటీ బాంబేకి రూ.315 కోట్లను విరాళంగా ఇచ్చినట్లు ట్విట్టర్ వేధఇకగా అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ప్రఖ్యాత విద్యాసంస్థతో తనకు ఉన్న 50 ఏళ్ల సుదీర్ఘ సంబంధం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు తాను సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.

తన జీవితంలో IIT-బాంబే ఒక మూలస్తంభంగా ఉందని అన్నారు. తన ప్రయాణానికి పునాది వేసిందని తెలిపారు. ఈ విరాళం కేవలం ఆర్థిక సహకారం కంటే ఎక్కువైనదని నందన్ నీలేకని తెలిపారు. ప్రస్తుతం తాను చేస్తున్న పని తనకు చాలా అందించిన ప్రదేశానికి నివాళిగా అభివర్ణించారు. అలాగే రేపు మన ప్రపంచాన్ని తీర్చిదిద్దే విద్యార్థులకు నిబద్ధతని పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన ఎంవోయూపై బెంగళూరులో నందన్ నీలేకని, ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌదరి సంతకాలు చేశారు. ఇది ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన, IIT బాంబేలో లోతైన టెక్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడంలో దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.
నందన్ నీలేకని 2009-2014 మధ్య కాలంలో కేబినెట్ మంత్రి హోదాలో UIDAI వ్యవస్థాపక ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన స్థాపించిన EkStep ఫౌండేషన్ లక్షలాది మంది చిన్నారులకు ప్రాథమిక అక్షరాస్యత అందించటంలో లాభాపేక్ష లేకుండా పనిచేస్తోంది. అలాగే 2023 జనవరిలో G20 టాస్క్ ఫోర్స్ ఆన్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎకనామిక్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అండ్ డెవలప్‌మెంట్ కి కో-చైర్‌గా నియమితులయ్యారు.


Click it and Unblock the Notifications