మొదటి రోజే 1.28 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిన ఐడియాఫోర్జ్.. ఇన్ఫోసిస్‌కు ఇక లాభాల పంటే
కరోనా సమయంలో మార్కెట్‌లోకి IPOలు భారీగా వచ్చాయి. తరువాతి కాలంలో భారీగా నెమ్మదించాయనే చెప్పాలి. తిరిగి ఇప్పుడు మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు కొన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. నిన్న రిలీజ్ అయిన డ్రోన్ మేకర్ ఐడియాఫోర్జ్ ఒక బంపర్ IPOగా చెప్పుకోవచ్చు.
ఐడియాఫోర్జ్ టెక్నాలజీ లిమిటెడ్ పబ్లిక్ ఆఫరింగ్(IPO) నిన్న ప్రారంభమైంది. 567 కోట్ల విలువైన పబ్లిక్ ఇష్యూకి రిటైల్ మరియు ఇతర కేటగిరీ పెట్టుబడిదారుల నుంచి బలమైన స్పందన లభించింది. బిడ్డింగ్ మొదటి రోజు మధ్యాహ్నం నాటికి 1.28 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. దాని రిటైల్ భాగం 5.11 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడటం విశేషం.

ఈ డ్రోన్ తయారీ కంపెనీలో ఇన్ఫోసిస్ ప్రధాన పెట్టుబడిదారు. 16 లక్షలకు పైగా షేర్ వాల్యూ కలిగి ఉంది. ఇది ఐడియా ఫోర్జ్ మొత్తం మూలధనంలో 4.25 శాతానికి సమానం. IPO ద్వారా మొత్తం 567 కోట్లు సేకరించాలని కంపెనీ నిర్ణయించింది. కాగా ఇందులో 240 కోట్లను రుణ చెల్లింపుల కోసం వినియోగించాలని భావిస్తోంది.
ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ప్రస్తుతం డ్రోన్స్ కంపెనీల పట్ల సానుకూల అభిప్రాయం ఉందని ప్రాఫిట్ మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాష్ గోరక్షకర్ తెలిపారు. అందువల్ల IPOతో పాటు సాధారణ పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇన్ఫోసిస్ ప్రీ-IPO ఇన్వెస్టర్‌గా ఉండటం వల్ల.. మీడియం నుంచి లాంగ్ టర్మ్ లాభాన్ని పొందవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications