దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు మంగళవారం ఓ దశలో రూ.1757ను తాకాయి. నిన్న ఈ స్టాక్ రూ.1755ను దాటగానే ఈ కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే ఆ తర్వాత స్టాక్ వ్యాల్యూ తగ్గింది. స్టాక్ వ్యాల్యూ రూ.1755.60 వద్ద ఉన్నప్పుడు ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ డాలర్లు దాటింది. మన కరెన్సీలో దాదాపు రూ.7.50 లక్షల కోట్లు. ఈ స్టాక్ చివరకు రూ.1720.55 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,29,919.40 కోట్లకు చేరుకుంది. నిన్న ఇన్ఫోసిస్ స్టాక్ ప్రారంభంలో భారీగా లాభపడినప్పటికీ, చివరకు దాదాపు ఒక శాతం లేదా రూ.17.25 క్షీణించి రూ.1721 వద్ద ముగిసింది. అంతకుముందు రోజు రూ.1738.75 వద్ద క్లోజ్ అయింది.

మార్కెట్ క్యాప్..
ఇన్ఫోసిస్ షేర్లు మంగళవారం ఓ దశలో ఒక శాతానికి పైగా లాభపడి, బీఎస్‌ఈ సూచీలో షేర్ వ్యాల్యూ రూ.1,757కు చేరుకుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.50 లక్షల కోట్ల సమీపానికి చేరుకుంది. దీంతో 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన నాలుగో భారతీయ కంపెనీగా నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పటికే 100 బిలియన్ డాలర్లు దాటింది. ఈ ఏడాది ఇన్ఫోసిస్ షేర్లు ఇప్పటికే 40 శాతం లాభపడ్డాయి. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో రూ.5,195 కోట్ల లాభాలను గడించింది ఈ కంపెనీ. గత ఏడాదితో పోలిస్తే 23 శాతం వృద్ధి సాధించింది. అలాగే గతంలో నిర్దేశించిన 12 శాతం నుండి 14 శాతం వార్షిక ఆదాయ అంచనాలను 14 శాతం నుండి 16 శాతానికి సవరించారు.

ఐటీ రంగం జోరు
డిజిటైజేషన్, క్లౌడ్ కంప్యూటింగ్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఐటీ రంగం జోరుగా ఉంది. కరోనా తదనంతర వ్యాపారాలు ఐటీకి కొత్త రూపు ఇస్తాయని భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేర్లు రాణిస్తున్నాయి. ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న తర్వాత ఇన్ఫోసిస్ షేర్ లాభాల స్వీకరణ నేపథ్యంలో చివరకు 0.99 శాతం నష్టపోయి రూ.1,721.50 వద్ద ముగిసింది.

టాప్ 5 కంపెనీలు
భారత ఐటీ స్టాక్స్ ఇటీవలి కాలంలో భారీగా ఎగిశాయి. ప్రపంచ ఐటీ రంగ షేర్లతో పోలిస్తే మన స్టాక్స్ ఇటీవలి కాలంలో 41.28 శాతం లాభపడ్డాయి. మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 5 కంపెనీల విషయానికి వస్తే....
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ నిన్న రూ.2182.80 ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1383773.64 కోట్లుగా ఉంది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టాక్ నిన్న రూ.3612.20 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1336171.34 కోట్లుగా ఉంది.
HDFC బ్యాంకు లిమిటెడ్ స్టాక్ నిన్న రూ.1558.75 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.862319.11 కోట్లుగా ఉంది.
ఇన్ఫోసిస్ స్టాక్ నిన్న రూ.1720.75 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.729919.40 కోట్లుగా ఉంది.
హిందూస్తాన్ యూనీలివర్ లిమిటెడ్ స్టాక్ నిన్న రూ.2638.10 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.619845.03 కోట్లుగా ఉంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications