భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన శ్రామిక శక్తిలో మహిళా ఉద్యోగులను పెంచడానికి మరో ముందడుగు వేసింది. కంపెనీ ఇటీవల ఉద్యోగులకు పంపిన ఒక మెయిల్‌లో రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ అనే కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇది పూర్తిగా మహిళల కోసం కేటాయించింది. ఈ ప్రోగ్రాం కెరీర్‌లో విరామం తీసుకున్న వారికి.. తిరిగి పనిలోకి రావాలనుకునే మహిళా నిపుణులను లక్ష్యంగా చేసుకుంది.
ఈ ప్రోగ్రాం కోసం మహిళలకు కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి, అలాగే కనీసం ఆరు నెలల విరామం ఉండాలి. ఇన్ఫోసిస్ ప్రధానంగా డెవలపర్, టెక్ లీడ్, మేనేజర్ పదవులను భర్తీ చేయాలని చూస్తోంది. జావా, .NET, SAP, ఒరాకిల్, సేల్స్‌ఫోర్స్, పెగాసస్, రియాక్ట్, పైథాన్, యాంగ్యులర్, ఇన్ఫార్మాటికా, సెలీనియం టెస్టింగ్ వంటి పలు టెక్నాలజీలలో అవకాశాలు ఉన్నాయి.

Infosys తన ESG విజన్ 2030లో భాగంగా.. 2030 నాటికి తన మొత్తం శ్రామిక శక్తిలో 45 శాతం మహిళా ప్రతినిధ్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కంపెనీ ఉద్యోగుల్లో మహిళలు సుమారు 39 శాతం ఉన్నారని తాజా ESG నివేదిక తెలిపింది. CHRO షాజీ మాథ్యూ మాట్లాడుతూ.. ఈ ప్రోగ్రాం కెరీర్‌లో విరామం తీసుకున్న ప్రతిభావంతులైన మహిళలు తిరిగి ఉద్యోగ రంగంలోకి రావడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది మా వైవిధ్యం మరియు చేరిక పట్ల ఉన్న కట్టుబాటులో భాగమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చేరే మహిళలకు మెంటర్‌షిప్, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు లభిస్తాయి. అలాగే, ఇన్ఫోసిస్ ఈ నియామకాలకు రిఫరల్ చేసే ఉద్యోగులను కూడా ప్రోత్సహిస్తోంది. విజయవంతమైన రిఫరల్‌లకు రూ. 50 వేల వరకు రివార్డులు ఇస్తోంది. JL3 పోస్టులకు రూ. 10 వేలు, JL4 పోస్టులకు 25 వేలు, JL5 పోస్టులకు రూ. 35 వేలు, JL6 పోస్టులకు రూ. 50 వేల వరకు వేతనాలు ఉండనున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిడ్-మేనేజ్‌మెంట్ పాత్రల్లో సుమారుగా 900 మహిళలు నియమితులయ్యారు. ఇది గత సంవత్సరం కంటే దాదాపు రెండింతల వృద్ధిగా చెప్పుకోవచ్చు.
AI సేవల సంస్థ RVAi గ్లోబల్ CEO విజయ్ శివరామ్ అభిప్రాయపడుతూ.. కోవిడ్ తర్వాత హైబ్రిడ్ వర్క్ పాలసీల కారణంగా మహిళా నిపుణులు తిరిగి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది ఎడ్‌టెక్ ద్వారా కొత్త టెక్నాలజీలలో అప్‌స్కిల్ అయ్యారని తెలిపారు. ఒక సీనియర్ మహిళా టెక్ ప్రొఫెషనల్ ప్రకారం.. ఇప్పుడు కంపెనీలు కేవలం మొత్తం వైవిధ్యం కాకుండా, మేనేజ్‌మెంట్ స్థాయిలో కూడా మహిళల శాతం పెంచడంపై దృష్టి పెడుతున్నాయి. ఇది కస్టమర్ల కళ్లలో వారి గ్లోబల్ ఇమేజ్‌ను మెరుగుపరుస్తుందని తెలిపారు. ఇన్ఫోసిస్ తన వార్షిక నివేదికలో పేర్కొన్నట్టుగా.. మోస్ట్ ఇన్‌క్లూజివ్ కంపెనీస్ ఇండెక్స్ 2024లో వరుసగా ఐదో సంవత్సరం చాంపియన్ ఆఫ్ ఇన్‌క్లూజన్ గా గుర్తింపు పొందింది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications