IT news: మైక్రోసాఫ్ట్‌తో జకతట్టిన ఇన్ఫోసిస్.. AI టెక్నాలజీని ఏలేందుకు ప్లాన్ రెడీ..
IT news: మానవ జీవితంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. OpenAI రూపొందించిన ChatGPT రాకతో AI టెక్నాలజీ దశ, దిశ పూర్తిగా మారిపోయింది. గూగుల్ వంటి దిగ్గజాలతో పాటు పలు సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలో తమ మార్కు చూపించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
భారతీయ సాంకేతిక ప్రపంచాన్ని మరింత ముందుకు నడిపించేందుకు మైక్రోసాఫ్ట్‌తో ఇన్ఫోసిస్ జత కట్టింది. సంయుక్తంగా GenAI సొల్యూషన్లను అభివృద్ధి చేయడానికి ఇరు దిగ్గజాలూ సిద్ధమయ్యాయి. తద్వారా ఇన్పోసిస్ టోపాజ్, అజూర్ OpenAI సర్వీసెస్, అజూర్ కాగ్నిటివ్ సేవల అభివృద్ధికి రెండూ సహకరించుకోనున్నాయి.

ఇరు కంపెనీలు తమ సొల్యూషన్స్‌తో ఎంటర్ ప్రైజ్ ఫంక్షన్స్ మెరుగుపరచేందుకు కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను ఓ చోట చేర్చనున్నాయి. ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ డేటా, AI కలయికతో బిజినెస్ ఉత్పాదకత పెంచడానికి, ఆదాయ వృద్ధిలో కొత్త మార్గాల అన్వేషణకు నడుం బిగించినట్లు ప్రకటన విడుదల చేశాయి.
మైక్రోసాఫ్ట్ సహకారంతో ఇన్ఫోసిస్ టోపాజ్ తన సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, డిజిటల్ నుంచి AI సొల్యూషన్‌లకు మారడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం Azure OpenAI సర్వీస్ మరియు Azure కాగ్నిటివ్ సేవలను ఉపయోగించనుంది. ఈ తరహా ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్‌లు కస్టమర్ల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచి, టర్న్-అరౌండ్ టైంని తగ్గిస్తాయి. తద్వారా భవిష్యత్ కొత్త వ్యాపారాలల్లో పెట్టుబడులకు ద్వారాలు తెరుస్తాయి.


Click it and Unblock the Notifications