ఇది కదా కావాల్సింది.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ కుష్ కబర్.. ఫిబ్రవరిలో జీతాల పెంపు..!

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జీతాల పెంపుకు సంబంధించి త్వరలోనే సమాచారం అందుకోవచ్చని ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది. కన్సల్టెంట్‌లు, సీనియర్ ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, సిస్టమ్ ఇంజనీర్‌లతో 5 లెవెల్స్ సహా అంతకంటే తక్కువ స్థాయిలలోని ఉద్యోగులకి 1 జనవరి 2025 నుండి వేతనాల పెంపుదల అమలులోకి వచ్చే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

ఈ పెంపుదలకు సంబంధించిన లెటర్స్ ఫిబ్రవరిలో వెలువడే అవకాశం ఉంది. తాజాగా జరిగిన టౌన్ హాల్ మీటింగ్‌లో ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఈ అప్‌డేట్‌ షేర్ చేసినట్లు సోర్సెస్ వెల్లడించాయి. డెలివరీ మేనేజర్‌లు, మేనేజర్‌లు, సీనియర్ డెలివరీ మేనేజర్‌లు ఇంకా సీనియర్ మేనేజర్‌లు (జాబ్ లెవెల్ 6 అండ్ అంతకంటే ఎక్కువ) వంటి ఉన్నత స్థాయి ఉద్యోగుల కోసం జీతం పెంపు లెటర్స్ మార్చి 2025లో జారీ చేయనుంది, పెరిగిన జీతాలు ఏప్రిల్ నుండి అమలులోకి వస్తాయి.

Infosys is set to roll out its annual pay hikes from February on a happy note for its employees

అయితే ఈ విషయమై మీడియా అడిగిన ప్రశ్నలకు ఇన్ఫోసిస్ స్పందించలేదు. అక్టోబరు 2024లో ఇన్ఫోసిస్ CFO జయేష్ సంఘ్‌రాజ్కా
కంపెనీ రెండు దశల్లో వేతనాల పెంపుదలని ప్లాన్ చేస్తున్నట్టు సూచించారు, జనవరి అండ్ ఏప్రిల్ 2025. డిసెంబర్ 2024లో ఉద్యోగులకు రేటింగ్ లెటర్‌లు జారీ చేసినట్లు నివేదించారు. చారిత్రాత్మకంగా ఇన్ఫోసిస్ గత జూలై నుండి అమలులోకి వచ్చే విధంగా జూన్‌లో వార్షిక జీతాల పెంపును అందించింది. అయితే, ఈ ప్రక్రియ 2024లో నిలిపి వేసింది, దింతో రాబోయే పెంపు ఉద్యోగులకు మరింత కీలకంగా మారింది.

ఇన్ఫోసిస్ స్టాక్ పర్ఫార్మెన్స్
ఇన్ఫోసిస్ షేర్లు శుక్రవారం ముగింపు ధరతో పోలిస్తే నేడు సోమవారం 0.08 శాతం తగ్గి రూ.1,965.20 వద్ద ట్రేడయ్యాయి. ఈ షేరు రూ.1,982.55 నుంచి రూ.1,948.75 రేంజ్‌లో కదిలాయి. నేడు షేర్లు పతనమైనప్పటికీ ఇన్ఫోసిస్ ఈ సంవత్సరం ఇప్పటివరకు 4.63 శాతం అలాగే గత ఐదు రోజులలో 1.45 శాతం లాభపడింది. ఇటీవలి త్రైమాసిక ఫలితాల్లో ఇన్ఫోసిస్ రూ.6,506 కోట్ల నెట్ ప్రాఫిట్ ప్రకటించింది.

మార్కెట్ అప్ డేట్
ఇదిలా ఉండగా, టాప్ 10 అత్యంత విలువైన కంపెనీల్లో ఐదు కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ.1,85,952.31 కోట్లు తగ్గింది. ఈ కంపెనీలలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అతిపెద్ద క్షీణతను చవిచూసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+