Infosys Vs Cognizant: భారతీయ టెక్ కంపెనీలు ప్రపంచ స్థాయిలో తన సత్తా చాటుతున్నాయి. అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ భారతదేశంలో అతిపెద్ద టెక్ ఆటగాళ్లలో ఒకటిగా ఉంది. కంపెనీ ఎక్కువ మంది ఉద్యోగులను ఇండియాలోనే హోల్డ్ చేస్తోంది. తాజాగా ఈ కంపెనీని ఒక భారతీయ సంస్థ అధిగమించటంతో కొత్త చరిత్రకు నాంది పలికింది.
కాగ్నిజెంట్ అంచనా వేసిన ఆదాయాలను అధిగమించి భారతదేశపు 2వ అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ టైటిల్‌ను తిరిగి పొందేందుకు ఇన్ఫోసిస్ రేసులో ముందు వరుసలో ఉంది. మార్కెట్ క్యాప్ ప్రకారం ప్రస్తుతం దేశంలో అతిపెద్ద టెక్ కంపెనీగా టాటా గ్రూప్ సంస్థ టీసీఎస్ తొలి స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ త్రైమాసిక ఆదాయం 3.8 శాతం పెరిగి దాదాపు 5 బిలియన్ డాలర్ల దగ్గరకు చేరుకుంది. అలాగే ఇన్ఫోసిస్ ఫ్రీ క్యాష్ ఫ్లో ఏడాదికి 25.2 శాతం పెరుగుదలను సాధించింది. సలీల్ పరేఖ్ నేతృత్వంలో కంపెనీ తిరిగి తన పూర్వ వైభవానికి వేగంగా చేరుకుంటోంది.

ఇదే క్రమంలో భారతీయ టెక్ కంపెనీలతో పోటీ పడలేకపోవటానికి అత్యున్నత సారధులు గడచిన 7 ఏళ్లలో మూడు సార్లు మారటమే. ప్రస్తుతం కంపెనీని భారత సంతతికి చెందిన సీఈవో ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే. తరచుగా మేనేజ్మెంట్ మారటం వల్ల అస్థిరత ఏర్పడటం కంపెనీ వృద్ధిని భారీగా ప్రభావితం చేసింది. దీనికి ముందు కొన్ని నెలల కిందట టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ బెల్కాన్‌ను 1.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం దాని ఆర్థిక, వ్యూహాత్మక చిక్కులకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. వాస్తవానికి ఇది కంపెనీ చేపట్టిన రెండవ అతిపెద్ద కొనుగోలుగా నిలిచింది.
ఈ క్రమంలో కాగ్నిజెంట్ త్రైమాసిక ప్రాతిపదికన 3,300 మంది ఉద్యోగులను తగ్గించగా.. ఏడాది ప్రాతిపదికన 7,100 మందిని తగ్గించింది. మెుదటి త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 3,44,400 మందిగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలో కాగ్నిజెంట్ యుటిలైజేషన్ రేషియో 1 శాతం పెరిగి 82 శాతానికి చేరుకుంది.
ఇదే క్రమంలో కంపెనీ అట్రిషన్ రేటు 13.1 శాతానికి తగ్గింది. కాగ్నిజెంట్ 2024లో ఊహించిన దానికంటే తక్కువ ఆదాయాన్ని అంచనా వేసింది. పలువురు సీనియర్-స్థాయి ఎగ్జిక్యూటివ్‌ల నిష్క్రమణను కూడా కంపెనీ వెనుకబడటానికి దారితీసింది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లపై మార్కెట్లో ఇన్వెస్టర్ల దృష్టి కొనసాగుతోంది. కరోనా తర్వాత అమెరికాలో సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించటంతో ఐటీ పరిశ్రమ మెల్లగా పుంజుకుంటూ మంచిరోజులు మెుదలయ్యాయని జాబ్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications