Infosys News: ఇంటి నుంచి పనికి స్వస్తి పలికి ఆఫీసులకు రావాలంటూ ఉద్యోగులకు TCS ఇటీవల హుకుం జారీ చేసింది. అయితే అదే బాటలో కాకుండా కొంచెం డైవర్షన్ తీసుకోవాలని దేశంలో రెండో అతిపెద్ద IT సేవల సంస్థ ఇన్పోసిస్ భావిస్తోంది. తన సిబ్బందికి కొంతమేర వెలుసులుబాటు ఇవ్వాలని చూస్తోంది. ఇదికాస్తా ఉద్యోగులకు వరం కానుంది.
ఉద్యోగులను ఒకేసారి కంపెనీకి తిరిగి రమ్మనేందుకు బదులుగా కొంత మృదువుగా వారితో వ్యవహరించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింంది. ఇందుకోసం సిబ్బందికి సౌకర్యవంతమైన విధానాన్ని అనుసరించాలని చూస్తోంది. ఉద్యోగులకు రిమోట్ వర్క్ ఆప్షన్‌ను ఆఫర్ చేస్తోంది. తద్వారా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తో పాటు సిబ్బందిపై ఒత్తిడి తగ్గించినట్లు అవుతుందని భావిస్తోంది.

2022 కొవిడ్ సమయంలో కంపెనీకి చెందిన 97 శాతం మంది ఇంటి నుంచి పనిచేయగా.. FY23లో 75 శాతం మంది ఆ ఆప్షన్ వినియోగించుకున్నారు. ఇక FY24లో దాదాపు 84 శాతం మంది రిమోట్‌గా పనిచేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ ట్రెండ్ మళ్లీ పెరుగుతున్నట్లు తెలుస్తోందని ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.
రిమోట్ వర్క్ కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా స్వస్థలాలలో ఉండి పనిచేయాలనుకునే ఉద్యోగులకు ఇన్ఫోసిస్ మద్దతు ఇస్తోంది. ఇందుకుగాను టైర్-2 నగరాల్లో తన ఉనికిని విస్తరిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం మరియు కోయంబత్తూరులో కొత్త కార్యాలయాలను ప్రారంభించింది. ఈ తరహా చర్యల ద్వారా పట్టణ కాలుష్యం మరియు నీటి ఎద్దడిని తగ్గించడం సహా విస్తృత పర్యావరణ లక్ష్యాలకు దోహదపడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications