For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ఫోసిస్‌లో 74 మంది కోటీశ్వరులు, వారికి ప్రమోషన్లు లేవు

|

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో 2019-20 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.కోటి వేతనం అందుకుంటున్న వారిలో 74 మంది ఉన్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 64గా ఉంది. ఏడాదిలో పదిమంది కోటీశ్వరులు పెరిగారు. వైస్ ప్రెసిడెంట్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ ఈ జాబితాలో ఎక్కువమంది ఉన్నారు. స్టాక్స్ ప్రోత్సాహకాల వ్యాల్యూ పెరగడంతో అంతకుముందు ఏడాది కంటే ఈసారి వీరి జాబితా ఎక్కువగా పెరిగింది. వీరి రెమ్యునరేషన్‌లో స్థిర వేతనం, వేరియేబుల్ పే, రెటిలర్ బెనిఫిట్స్, స్టాక్ ఆప్షన్స్ ఉన్నాయి.

వేతనాలు పెరిగాయి, లాభం తగ్గింది: 27% పెరిగిన ఇన్ఫోసిస్ సీఈవో రెమ్యునరేషన్వేతనాలు పెరిగాయి, లాభం తగ్గింది: 27% పెరిగిన ఇన్ఫోసిస్ సీఈవో రెమ్యునరేషన్

ప్రమోషన్లు లేవు

ప్రమోషన్లు లేవు

ఇన్పోసిస్ లీడర్‌షిప్ స్థాయిలో వేతనాలు ఈసారి స్థిరంగా లేదా తక్కువగా ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అంతగా ప్రమోషన్లు లేవు. గత ఏడాది ఇండియాలోని ఇన్ఫోసిస్ ఉద్యోగుల సగటు వేతనం పెరిగింది. రూ.కోటికి పైగా వేతనం పొందుతున్న వారిలో వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోదాల్లో ఉన్నవారు ఉండటంతో పాటు గత ఏడాది మంజూరు చేసిన షేర్ల వ్యాల్యూ ఆధారంగా వారి రాబడి భారీగా పెరిగింది.

7.3 శాతం పెరిగిన వేతనం

7.3 శాతం పెరిగిన వేతనం

2019-20 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల మధ్యస్థ వేతనం 10 శాతం పెరిగి రూ.6.2 లక్షల నుండి రూ.6.8 లక్షలకు చేరుకుంది. ప్రమోషన్లు, ఇతర అంశాల ఆధారంగా ఉద్యోగుల సగటు వేతనం ఇండియాలో 7.3 శాతం పెరిగింది.

వీరి మధ్యస్థ వేతనం ఎంత పెరిగిందంటే

వీరి మధ్యస్థ వేతనం ఎంత పెరిగిందంటే

ఇన్ఫోసిస్ సలీల్ పరేఖ్ భారత్‌లో అత్యధిక వేతనం అందుకున్న ఐటీ సీఈవోగా నిలిచారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను సలీల్ పరేఖ్ మధ్యస్థ వేతనం (MRE) 502 శాతం పెరగగా, సీవోవో యూబీ ప్రవీణ్ రావు వేతనం 155 శాతం పెరిగింది. మున్ముందు మరిన్ని సవాళ్లను విజయవంతంగా సాంకేతికతతో ధీటుగా ఎదుర్కొనేందుకు అందరూ కార్యోన్ముఖులు కావాలని, ఇదే నిజమైన పరీక్ష అని వాటాదారులకు రాసిన లేఖలో ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని సూచించారు.

English summary

ఇన్ఫోసిస్‌లో 74 మంది కోటీశ్వరులు, వారికి ప్రమోషన్లు లేవు | Infosys had 74 crorepatis in 2020 fiscal, no promotion for leaders

Infosys had 74 employees in its crorepati club in 2019-20, up from 64 in the year before. Employees at the designation of vice-presidents and senior vice presidents make up for the bulk of the crorepatis.
Story first published: Thursday, June 4, 2020, 9:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X