Infosys News: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ స్థాయిలో పెర్ఫార్మెన్స్ బోనస్ పే-అవుట్
Infosys Bonus: దేశంలోని రెండవ అతిపెద్ద IT సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన సిబ్బందికి గుడ్‌న్యూస్ చెప్పింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగుల నిరీక్షణకు తెరదింపిది. వారి కళ్లలో ఆనందం నింపే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చర్య కాస్తా సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకునేందుకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని సంస్థ భావిస్తోంది.
2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికానికి ఇన్ఫోసిస్ బోనస్ చెల్లింపులను ప్రారంభించింది. అర్హత కలిగిన ఉద్యోగులు సగటున 80 శాతం మేర పే అవుట్ పొందనున్నట్లు తెలుస్తోంది. E6 మరియు అంతకన్నా తక్కువ స్థాయిలోని ఉద్యోగులు అత్యధిక బెనిఫిట్ పొందనున్నట్లు పేర్కొంది. బెంగళూరు బేస్డ్ కంపెనీ క్యాంపస్‌లో ఈ స్థాయి శ్రామికశక్తి ఎక్కువగా పనిచేస్తున్నారు.

మార్చి 31న ముగిసిన మొదటి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ సగటున 60 శాతం బోనస్ ఆఫర్ చేసింది. అప్పటితో పోలిస్తే రెండో క్వార్టర్ నాటికి ఈ మొత్తంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. గత కొంత కాలంగా తాము పొందుతున్న బోనస్‌లలో ఇది అత్యుత్తమమని కంపెనీ ఉద్యోగులు చెబుతున్నారు. అయితే త్రైమాసిక బోనస్ చెల్లింపులు వ్యక్తిగత పనితీరు మరియు సహకారాల ఆధారంగా మారుతూ ఉంటాయి. కేటాయించిన బడ్జెట్ ప్రకారం డెలివరీ యూనిట్ల మేనేజర్స్ ప్రతి ఉద్యోగికి తగిన బోనస్ శాతాన్ని నిర్ణయిస్తారు.
'అధిక-పనితీరు గల పని సంస్కృతిని నిర్మించడంలో భాగంగా బోనస్ పే-అవుటు చేస్తున్నాము. మా సంస్థాగత లక్ష్యాలకు అనుగుణంగా పనితీరు ఆధారంగా వైవిధ్యాన్ని కొనసాగిస్తున్నాము' అని ఇన్ఫోసిస్ తెలిపింది. కాగా కంపెనీ రాబడిలో 3.6 శాతం పెరుగుదలతో పాటు ఏడాదికి నికర లాభం 7.1 శాతం వృద్ది చెందింది. దాని టాప్ లెవల్ ప్రత్యర్థులను మించి మంచి నంబర్స్ సాధించింది. ఈ మేరకు ఉద్యోగులను ప్రశంసిస్తూ కంపెనీ ఇ-మెయిల్ పంపినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications