TIME మ్యాగజైన్ 2023 ప్రపంచ అత్యుత్తమ కంపెనీల జాబితాలో టాప్ 100లో కంపనీల్లో భారత్ కు చెందిన ఒకేఒక సంస్థ చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో ఇన్ఫోసిస్ స్థానం దక్కించుకుంది. బెంగళూరుకు చెందిన గ్లోబల్ కన్సల్టింగ్, IT సేవల సంస్థ మొత్తం 750 ప్రపంచ కంపెనీలలో 88.38 స్కోర్‌తో 64వ స్థానంలో నిలిచింది. ఇన్ఫోసిస్ ను 1981లో స్థాపించారు. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం ఈ సంస్థ 3,36,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో NYSE లిస్టెడ్ గ్లోబల్ కన్సల్టింగ్, IT సేవలు అందిస్తోంది.
40 సంవత్సరాలకు పైగా సాగిన దాని ప్రయాణంలో, సాఫ్ట్‌వేర్ సేవల ప్రతిభకు ప్రపంచ గమ్యస్థానంగా భారతదేశం ఆవిర్భవించడానికి దారితీసిన కొన్ని ప్రధాన మార్పులను కంపెనీ వివరించింది. "మేము టాప్ 3 గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థలో ఉన్నాము. టాప్ 100 గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో భారతదేశం నుంచి వచ్చిన ఏకైక బ్రాండ్" అని కంపెనీ X (గతంలో ట్విట్టర్)లో రాసింది. ఇదిలా ఉండగా TIME, Statistaచే నిర్వహించబడిన జాబితాలో మొదటి 4 స్థానాల్లో ఉన్న సంస్థలు అన్నీ పెద్ద టెక్, యునైటెడ్ స్టేట్స్‌కు చెందినవి కంపెనీలే ఉన్నాయి.

అందులో Microsoft, Apple, Alphabet (Google) Meta Platforms (గతంలో Facebook) ఉన్నాయి. యాక్సెంచర్, ఫైజర్, అమెరికాన్ ఎక్స్ ప్రేస్, ఎలక్ట్రిసిటి డి ఫ్రాన్స్, బీఎండబ్ల్యూ గ్రూప్, డెల్ టెక్నాలజీస్, ఎల్వీఎంహెచ్ మెట్ హెన్సే లాసిస్ వుటెన్, డెల్టా ఎయిర్ లైన్స్, స్టార్ బ్రిక్స్ కార్ప్, వోక్స్ వెగన్ గ్రూప్, జనరల్ మోటర్స్, ఎవలెన్స్ హెల్త్, బోచ్, ఫోర్డ్, జాన్సాన్ అండ్ జాన్సాన్ టాప్ 20 లో చోటు దక్కించుకున్నాయి.
ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న కంపెనీలను గుర్తించడానికి TIME పలు అంశాలను పరిశీలించింది.
ఉద్యోగుల సంతృప్తి, ఆదాయ వృద్ధి, సుస్థిరత లేదా పర్యావరణ, సామాజిక, కార్పొరేట్ పాలన (ESG) అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి మైక్రోసాఫ్ట్ ను ఉదాహరణగా వివరించింది. మైక్రోసాఫ్ట్ అగ్రస్థానంలో ఉన్న కంపెనీ అని పేర్కొంది. ఆర్థిక సంవత్సరంలో $72 బిలియన్లను ఆర్జించినట్లు తెలిపింది. ఇది 2020 నుంచి 63 శాతం పెరిగిందని అదే సమయంలో మొత్తం ఉద్గారాలను 0.5 శాతం తగ్గించిందని వివరించింది.ఇన్ఫోసిస్ టాప్ 100లో చేరిన ఏకైక భారతీయ కంపెనీ మాత్రమే కాదు, జాబితాలోని టాప్ 3 ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీలలో ఒకటి. ఇన్ఫోసిస్ కంటే మందు యాక్సెంచర్ (ర్యాంక్ 4), డెలాయిట్ (ర్యాంక్ 36) ఉన్నాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications