Infosys News: బరువెక్కిన హృదయాలు, చెదిరిన కలలతో కన్నీళ్లు.. ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ మిగిల్చిన గాయం..!
Infosys Layoffs: దేశంలో టాప్ ఐటీ దిగ్గజంగా ఉన్న ఇన్ఫోసిస్ తాజా లేఆఫ్ చర్యలు ఐటీ ప్రపంచంలో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. మైసూరు క్యాంపస్ నుంచి దాదాపు 400 మంది ఫ్రెషర్లను లేఆఫ్ చేయటం, వారిని వెంటనే వెకేట్ చేయాలని చెప్పటం కోటి కలలతో వచ్చిన టెక్ ఫ్రెషర్లకు పీడకలను మిగిల్చింది.
తాజాగా కంపెనీ నిర్ణయంతో హటాత్తుగా ట్రైనీలు క్యాంపస్ ఖాళీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఒక యువతి అకస్మాత్తుగా ఖాళీ చేయలేనని ఈ రాత్రికి ఉండనిస్తే రేపు వెళ్లిపోతానని కన్నీటితో వేడుకున్నప్పటికీ పట్టించుకోలేదని వెల్లడైంది. ఇప్పుడు మీరు కంపెనీ ఉద్యోగులు కారు సాయంత్రం 6 గంటలకల్లా క్యాంపస్ నుంచి వెళ్లిపోవాలని ఇన్ఫోసిస్ అధికారులు ట్రైనీలకు వెళ్లడించారు. దాదాపు రెండున్నర ఏళ్లు ఎదురుచూపుల తర్వాత బాధాకరమైన వార్తతో తల్లిదండ్రులకు ఎలా ముఖం చూపించాలనే ఆందోళనలో ట్రైనీలు ఉన్నారు.

ఉదయం తమను మీటింగ్ కి రావాలని చెప్పగా.. బయట సెక్యూరిటీ, లోపల బౌన్సర్లు ఉన్నట్లు తొలగించబడిన ట్రైనీలు చెప్పారు. అలాగే తొలగించబడిన వారికి వచ్చిన మెయిల్ ప్రకారం ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలని ఇతరులతో చర్చించవద్దని చెప్పబడింది. అయితే తొలగింపు సమయంలో క్యాంపస్ లో యూఎస్ క్లయింట్స్ ఉన్నారని వారికి కనిపించకుండా అడ్డంగా బస్సులు పెట్టి ఒకరి తర్వాత మరొకరిని పిలిచి లేఆఫ్ గురించి వెల్లడించారని ఒక ట్రైనీ వెల్లడించాడు. అలాగే 2024 నుంచి కంపెనీ అర్హత ప్రమాణాలను మరింత కఠినతరం చేయటం వల్లనే తాము ఫెయిల్ అయినట్లు ట్రైనీలు చెబుతున్నారు. కంపెనీ మాత్రం తాము హై క్వాలిటీ టాలెంట్ మాత్రమే ఎంపిక చేస్తున్నట్లు తొలగింపులపై సమర్థించుకుంది.
అయితే ప్రస్తుతం కంపెనీలో ట్రైనింగ్ పొందుతున్న దాదాపు 4500 ఫ్రెషర్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు ప్రస్తుతం కంపెనీలో ట్రైనింగ్ పొందుతున్నారు. గడచిన రెండున్నరేళ్లుగా ఫ్రెషర్ల ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా మార్పులకు గురైందని వారు చెబుతున్నారు. 2022లో ఫ్రెషర్లకు అవసరమైన సమయం అందించబడేదని ప్రస్తుతం ఇది భారీగా తగ్గించబడిందని వారు చెబుతున్నారు. అలాగే పాసింగ్ క్రైటీరియా కూడా పెంచబడిందని వారు చెబుతున్నారు.
2024లో ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగం డిమాండ్ మందగమనంతో ఇబ్బందులు ఎదుర్కోవటంతో ఎంపిక ప్రకియను ఐటీ దిగ్గజం కఠినతరం చేసి తమను చివరికి ఇంటికి పంపించిందని ట్రైనీలు వాపోతున్నారు. వాస్తవానికి ఈ క్రమంలోనే ఐటీ రంగంలోని అనేక కంపెనీలు తమ రిక్రూట్మెంట్ అండ్ హైరింగ్ ప్రక్రియను దాదాపుగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఎంపిక ప్రక్రియలో చేసిన అనేక మార్పులు ఎక్కువ మంది ఫెయిల్ కావటానికి దారితీస్తోందని వారు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications