IT News: ChatGPTపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కీలక కామెంట్స్.. టెక్కీలు ఇది విన్నారా..?
IT News: ప్రపంచ వ్యాప్తంగా టెక్ రంగంలో ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తోంది ఏఐ టూల్ చాట్ జీపీటీ. ఇది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాబోతోందని.. లక్షల ఉద్యోగాలు రానున్న కాలంలో పోనున్నాయని వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే దీనిపై ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ నారాయణ మూర్తి తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. టెక్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన 76 ఏళ్ల నారాయణ మూర్తి పెరుగుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం గురించి మాట్లాడారు. జ్ఞానాన్ని పెంచుకునేందుకు చాట్ జీపీటీ ఆధునిక కాలంలో మంచి సాధనమని మూర్తి వెల్లడించారు.

మానవ మెదడు చాలా శక్తివంతమైనదని.. ఇది చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ కంటే అత్యుత్తమంగా అవసరానుగుణంగా మార్పులు చేసుకోగలదని అన్నారు. అందువల్ల వేగంగా చాట్ జీపీటీ విస్తరించటంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇలాగే 80ల దశకంలో కోడ్ జనరేటర్లు వచ్చినప్పుడు యువత ఉద్యోగ అవకాశాలను కోల్పోతుందని ఆందోళనలు వెల్లువెత్తాయని.. అయితే మానవ మేధస్సు వాటి కంటే అత్యుత్తమ పనితీరుతో పెద్ద సమస్యలకు పరిష్కారాలను చూపారన్నారు.
శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన AI పవర్‌హౌస్ OpenAI నవంబర్ 2022లో ChatGPTని ప్రవేశపెట్టిన తర్వాత టెక్ ప్రపంచంలో అంతరాయాన్ని కలిగించింది. పెద్ద భాషా మోడల్ GPT-4 ద్వారా ఆధారితమైన AI చాట్‌బాట్ మానవుల తరహా ప్రతిస్పందనలను అందిస్తోంది. దీనిని ప్రారంభించినప్పటి నుంచి డెవలపర్లు, ఇంజనీర్లు AI చాట్‌బాట్‌లను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు.


Click it and Unblock the Notifications