Andhra Pradesh Techie Arrested at Infosys Bengaluru: ఇన్ఫోసిస్ బెంగళూరు క్యాంపస్‌లో ఒక మహిళను వాష్‌రూమ్‌లో వీడియో తీసిన ఘటన కలకలం రేపింది. కంపెనీ క్యాంపస్ లోని వాష్ రూంలో ఓ ఉద్యోగి తన సహోద్యోగి అయిన మహిళ అశ్లీల వీడియోను రహస్యంగా రికార్డ్ చేసిన ఆరోపణలపై అతనిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్వప్నిల్ నగేష్ మాలి (28) గా గుర్తించారు.ఈ ఘటన తర్వాత ఇన్పోసిస్ ఆ ఎంప్లాయ్ ని జాబ్ నుంచి తొలగించింది. ఇటువంటి వేధింపులను సహించే ప్రసక్తే లేదని.. మహిళల భద్రతే ముఖ్యమని తేల్చి చెప్పింది. ఈ సంఘటన జూన్ 30న చోటు చేసుకోగా ఈ రోజు వెలుగులోకి వచ్చింది.
ఇన్ఫోసిస్‌లో సీనియర్ అసోసియేట్ నగేష్ స్వప్నిల్ ను.. ఒక మహిళా ఉద్యోగి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఆమె వాష్ రూంకి వెళ్లినప్పుడు ముందు తలుపు మీద తన నీడను చూసింది. వెంటనే ఎవరో ఏదో చేస్తున్నారని గ్రహించింది. తన పక్కనే ఉన్న మరో వాష్ రూంలో అనుమానాస్పద కదలికలను గుర్తించానని ఆ మహిళ తెలిపింది. ఆ సమయంలో అక్కడ వాష్ రూంలో ఉన్న నగేష్ తనను వీడియో తీస్తున్నట్లుగా ఆమె గుర్తించింది.

దీంతో భయంతో అలర్ట్ అయిన ఆ ఉద్యోగిని ఈ దారుణ ఘటనపై అలారం మోగించింది. వెంటనే అక్కడకు చేరుకున్న ఇతర ఉద్యోగులు మరో వాష్ రూంలో ఉన్న ఆ మేల్ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం అతి మొబైల్ ఫోన్ చెక్ చేయగా అందులో రికార్డ్ చేసిన వీడియో కనిపించింది. అక్కడే అతన్ని పట్టుకుని చితకబాదారు. ఈ న్యూస్ బయటకు రాగానే ఆ బాధితురాలి సమక్షంలోనే హెచ్‌ఆర్ సిబ్బంది ఆ వీడియోని తొలగించారు. ఆ తర్వాత ఈ ఘటనపై ఇన్ఫోసిస్ హెచ్‌ఆర్ సిబ్బంది దర్యాప్తు చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని ఫోన్‌లో వేర్వేరు మహిళల 30 కి పైగా రికార్డ్ వీడియోలు దొరికాయని దర్యాప్తులో తేలింది.
అయితే బాధితురాలు తన భర్తతో కలిసి ఈ ఘటనపై ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రహస్యంగా ఇంకెవరైనా మహిళలను రికార్డ్ చేశాడా అని కోణంలో వారు దర్యాప్తు చేస్తున్నారు. అతని మొబైల్ ఫోన్‌లో డిలీట్ చేసిన వీడియోల కోసం దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
ఈ ఘటనపై ఇన్ఫోసిస్ స్పందించింది. తన అధికారిక ప్రకటనలో ఈ ఘటనపై మేము తక్షణ చర్యలు తీసుకున్నాం. సంబంధిత ఉద్యోగిని కంపెనీ నుండి తొలగించాం. బాధిత మహిళకు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో సహకరించాం. మేము హింస, వేధింపులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. ఇలాంటి అంశాల్లో నిషేధ విధానం పాటిస్తామని వెల్లడించింది.
More From GoodReturns

పేదలకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్.. ఈ ఏడాది చివరినాటికి మరో 4.5 లక్షల ఇళ్లు..

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

బెంగళూరు హౌసింగ్ మార్కెట్ ఢమాల్.. ఒరాకిల్ లేఆప్స్ దెబ్బకు ఉద్యోగులు విలవిల..

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications