ముంబై: మార్కెట్లు నేడు(జూలై 1, గురువారం) నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 165 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 41 పాయింట్ల మేర నష్టపోయింది. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాలు లాభాల్లో ముగియగా, ఎనర్జీ, బ్యాంకు, మెటల్, ఇన్ఫ్రా, ఐటీ రంగాలు మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీలు నష్టపోగా, స్మాల్ క్యాప్ సూచీలు 0.3 శాతం లాభపడింది.
నేటి నుండి ఆటోమొబైల్ కంపెనీలు జూన్ గణాంకాలను విడుదల చేయనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో సూచీలు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ, దేశీయ సూచీలు నష్టపోయాయి.

నష్టాల్లో మార్కెట్లు
సెన్సెక్స్ చివరకు నష్టాల్లో ఉంది. సెన్సెక్స్ 164.11 (0.31%) పాయింట్లు నష్టపోయి 52,318.60 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 41.50 (0.26%) పాయింట్లు క్షీణించి 15,680.00 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 52,638.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,638.50 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,281.01 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,755.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,755.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,667.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2.50 శాతం, హిండాల్కో 1.98 శాతం, బజాజ్ ఆటో 1.71 శాతం, టాటా మోటార్స్ 1.37 శాతం, సన్ ఫార్మా 1.29 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్ 2.42 శాతం, గ్లాండ్ 1.67 శాతం, శ్రీ సిమెంట్స్ 1.62 శాతం, బ్రిటానియా 1.48 శాతం, ఇన్ఫోసిస్ 1.29 శాతం, నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో HDFC బ్యాంకు, రిలయన్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ ఉన్నాయి.

రంగాలవారీగా...
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ 50 సూచీ 0.26 శాతం, మిడ్ క్యాప్ 0.47 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.82 శాతం, నిఫ్టీ ఆటో 1.01, నిఫ్టీ బ్యాంకు 0.25 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.39 శాతం, నిఫ్టీ ఫార్మా 0.93 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.13 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు 0.25 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.57 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.41 శాతం, నిఫ్టీ ఐటీ 0.57 శాతం, నిఫ్టీ మీడియా 0.15 శాతం, నిఫ్టీ మెటల్ 0.16 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.33 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.34 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications