టైమ్-ట్రాకింగ్ విధానంపై ఇన్ఫోసిస్‌కు భారీ షాక్.. రూ. 2 కోట్ల జరిమానా విధించిన ఫ్రెంచ్ కార్మిక సంస్థ..

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రెంచ్ కార్మిక అధికారులు భారీ షాకిచ్చారు. సమయ నమోదు (Time-recording) వ్యవస్థ ఫ్రెంచ్ చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో సుమారు రూ. 2 కోట్ల (175,000 యూరోలు) జరిమానా విధించారు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రాంతీయ కార్మిక సంస్థ DRIEETS Ile-de-France ఈ చర్యలు చేపట్టింది. ఈ జరిమానా వసూలుకు సంబంధించిన సమాచారం అందిందని.. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌ ద్వారా వెల్లడిస్తున్నామని ఇన్ఫోసిస్ తాజా ప్రకటనలో తెలిపింది.

రెగ్యులేటర్ జరిపిన పరిశోధనల ప్రకారం.. ఇన్ఫోసిస్ ఉపయోగిస్తున్న టైమ్-ట్రాకింగ్ వ్యవస్థ విశ్వసనీయత, ఆడిట్ చేయదగిన రికార్డులను నిర్వహించగల సామర్థ్యం, కొంతమంది ఉద్యోగులను పర్యవేక్షించే తీరుపై తీవ్ర సందేహాలు వ్యక్తమయ్యాయి. ఫ్రెంచ్ కార్మిక నిబంధనల ప్రకారం.. యజమానులు చట్టబద్ధమైన 35-గంటల పనివారం, ఓవర్‌టైమ్, తప్పనిసరి విశ్రాంతి సమయాలను కచ్చితంగా నమోదు చేయాలి. ఈ రికార్డులు ఎప్పుడు పడితే అప్పుడు తనిఖీకి (ఆడిట్‌కు) వీలుగా ఉండాలి. అయితే ఈ లోపాల వల్ల ఏయే వర్గాల ఉద్యోగులు ప్రభావితమయ్యారు లేదా ఈ వ్యవస్థలో ఎలాంటి నిర్దిష్ట మార్పులు చేయాలని కోరారనేది కంపెనీ ఫైలింగ్‌లో స్పష్టం చేయలేదు.

Infosys Infosys Fine Infosys News Employee Time Tracking Employee Monitoring Workplace Surveillance Labour Law IT Industry Infosys Penalty HR Policy Employee Rights Corporate News Indian IT News Time Tracking System Business News

ఈ జరిమానాపై ఇన్ఫోసిస్ స్పందిస్తూ.. దీని ప్రభావం తమ ఆర్థిక వ్యవహారాలు, కార్యకలాపాలు లేదా వ్యాపారంపై పెద్దగా ఉండదని కొట్టిపారేసింది. ప్రస్తుతం ఈ సమాచారాన్ని సమీక్షిస్తున్నామని, తదుపరి చర్యలను అంచనా వేస్తున్నామని పేర్కొంది. ఒకవైపు భారతదేశంలోని కార్యాలయాల నుండి ఉద్యోగులను అదనపు సమయం పనిచేయాలని కోరుతున్న తరుణంలోనే.. ఐరోపాలో ఇన్ఫోసిస్‌కు ఈ అనుభవ ఎదురవడం గమనార్హంగా చెప్పుకోవచ్చు.

Also Read

ఇటీవలే ఇన్ఫోసిస్ తన వర్క్-ఫ్రమ్-ఆఫీస్ నిబంధనలను కఠినతరం చేసింది. మొదట 7వ స్థాయి (JL7), అంతకంటే ఎక్కువ స్థాయి ఉద్యోగులను వారానికి నాలుగు రోజులు ఆఫీసుకు రావాలని ఆదేశించిన కంపెనీ.. మార్చి నెలలో ఈ విధానాన్ని 6A (JL6+) శ్రేణికి కూడా విస్తరించింది. అంతర్గత ఇమెయిల్స్ ప్రకారం.. ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు ఆఫీస్ హాజరును పూర్తి చేయడంలో విఫలమవడమే ఈ కఠిన నిబంధనలకు కారణమని తెలుస్తోంది. అయితే టీం కృషి, ఆవిష్కరణలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకున్నామని.. తమది ఇప్పటికీ 'హైబ్రిడ్ మోడల్' అని కంపెనీ సమర్థించుకుంటోంది.

మరోవైపు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి గతంలో చేసిన వ్యాఖ్యల వల్ల పని గంటలపై ఇప్పటికే తీవ్ర చర్చ జరుగుతోంది. చైనాలోని '9-9-6' (వారానికి 6 రోజులు, ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు, అంటే 72 గంటలు) పని సంస్కృతిని ఉదహరిస్తూ.. కష్టపడకుండా ఏ దేశమూ ముందుకు వెళ్లలేదని, భారతీయ యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కానీ, ప్రస్తుతం ఫ్రెంచ్ అధికారులు విధించిన జరిమానా ఉద్యోగులు ఎన్ని గంటలు పనిచేశారనే దానికంటే.. కంపెనీ ఆ పని గంటలను చట్టబద్ధంగా, కచ్చితంగా నమోదు చేయడంలో విఫలమైందనే కోణంలోనే రావడం గమనార్హంగా చూడవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+