IT News: ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సర్వీస్ కంపెనీ కాగ్నిజెంట్ సీఈవోగా రవికుమార్ నియమితులైన తర్వాత పోటీ కంపెనీలకు చెందిన ప్రముఖ ఎగ్జిక్యూటివ్ లను నియమించుకుంటూ ఇతర కంపెనీలకు షాక్ ఇస్తున్నారు.
ప్రస్తుత తరుణంలో కాగ్నిజెంట్ వ్యాపారాన్ని, కస్టమర్ల సంఖ్యను వేగంగా పెంచటమే లక్ష్యంగా రవి కుమార్ పనిచేస్తున్నారు. ఈ కీలక లక్ష్యాన్ని సాధించేందుకు రవికుమార్ నేతృత్వంలోని కాగ్నిజెంట్ ఇప్పుడు ఇన్ఫోసిస్ మాజీ సీఈవో విశాల్ సిక్కాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది ఒక విధంగా ఇన్ఫోసిస్ కంపెనీకి ఒక షాకింగ్ విషయంగా చెప్పుకోవచ్చు.

ఇన్ఫోసిస్ సీఈవో పదవి నుంచి వైదొలిగిన తర్వాత విశాల్ సిక్కా సృష్టించిన సంస్థ వియానై సిస్టమ్స్. ఇప్పుడు కాగ్నిజెంట్, వియానై సిస్టమ్స్ మార్కెట్‌ప్లేస్‌లోని వినియోగదారులకు నేరుగా జనరేటివ్ AI సేవలను అందించేందుకు జతకట్టాయి. వియానై సిస్టమ్స్ కు సంబంధించిన హిలా ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫారమ్, కాగ్నిజెంట్ న్యూరో AI ప్లాట్‌ఫారమ్‌లు ఈ కూటమిలో మిళితం చేయబడి AI సాంకేతికత ద్వారా వినియోగదారులకు సేవలను అందిస్తాయి.
కాగ్నిజెంట్, వియానై సిస్టమ్స్ కూడా రెండు కంపెనీల కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి ఉద్యోగులను కలుపుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఏఐ ఆధారిత లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లపై పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, విశాల్ సిక్కా కూటమి ఇన్ఫోసిస్ టాప్ మేనేజ్‌మెంట్‌ను షాక్‌వేవ్‌లను పంపింది. పైగా వీరిద్దరూ ఇన్ఫోసిస్ మాజీ ఉన్నత స్థాయి ఉద్యోగులు కావటమే దీనికి కారణం. ఇన్ఫోసిస్ తొలిసారిగా పనితీరును చూసి బయటి వ్యక్తి విశాల్ సిక్కాకు సీఈవో పదవిని కట్టబెట్టింది. అయితే ఆయన ఎక్కువ కాలం కంపెనీలో పనిచేయలేదు.


Click it and Unblock the Notifications