Mohandas Pai: గడచిన కొన్ని దశాబ్ధాలుగా భారతదేశంలో ఐటీ పరిశ్రమ విపరీతమైన అభివృద్ధిని సాధించింది. సేవల రంగంలో పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని లక్షల సంఖ్యలో విద్యార్థులు ఏటా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారు. అయితే లక్షలు వెచ్చించి చదివిన వారికి చివరికి వేలల్లో కూడా వేతనాలు పొందలేని పరిస్థితి కొనసాగుతోంది. అయితే చాలా టెక్ కంపెనీలు దీనినే అదనుగా తీసుకుని ఉద్యోగులను మోసం చేస్తున్నాయి.
ఐటీ సేవల రంగంలోని టెక్ కంపెనీలు చేస్తున్న కొన్ని దుర్మార్గపు పనులు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. 2011 నుంచి దేశంలోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలను పెంచడం లేదని ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మోహన్ దాస్ పాయ్ ఒక ఇంటర్వ్యూలో విమర్శించారు. ప్రస్తుతం ఆయన అరిన్ క్యాపిటల్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా రిక్రూట్ చేసుకునే ఫ్రెషర్లకు టెక్ కంపెనీలో 2011లో రూ.3.25 లక్షల వార్షిక ప్యాకేజీని ఆఫర్ చేసేవి. అయితే దాదాపు దశాబ్ధానికి పైగా కాలం గడచినప్పటికీ ఫ్రెషర్లకు కంపెనీలు అన్యాయం చేస్తున్నాయని, ప్రస్తుతం వారికి కేవలం రూ.3.75 లక్షల వరకు మాత్రమే జాబ్ ఆఫర్ ప్యాకేజీని అందిస్తున్నాయని విమర్శించారు.

ఉన్నత స్థాయి ఉద్యోగులు, సీఈవో స్థాయిలో పనిచేసే వారి వేతన పెంపులతో పోల్చినప్పుడు కింద ప్రారంభ స్థాయిలో ఉద్యోగులకు కంపెనీలు తక్కువ పెంపులను ఇవ్వటంపై మోహన్ దాస్ పాయ్ కామెంట్ చేశారు. కంపెనీ ఈ వివక్షను ఎలా సమర్థించుకుంటాయని ఆయన అన్నారు. మరోపక్క ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్ఆర్ నారాయణమూర్తి మాత్రం యువత వారానికి 70 గంటలు పనిచేయాలని అన్ని ఇంటర్వ్యూల్లో ఊదరగొడుతున్నారు. పనికి తగినట్లుగానే పేమెంట్ కూడా ఉండాలి కథా అనే ప్రశ్నలు సాధారణ ప్రజల నుంచి మేధావుల వరకు అన్ని వర్గాల నుంచి వినిపిస్తూనే ఉంది. అయితే చాలా మంది ఇలా తక్కువ వేతనాలకు పనిచేయటాన్ని వెట్టిచాకిరి అని కూడా భావిస్తున్న పరిస్థితులు ఉన్నాయి.
అయితే ఇటీవల భారతదేశ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ.. దేశంలోని వివిధ కంపెనీలు ఈ సంవత్సరం గత 15 ఏళ్లలో అత్యధిక లాభాలను ఆర్జించాయని వెల్లడించారు. అయితే వాటికి అనుగుణంగా ఉద్యోగుల వేతనాలను పెంచలేదని అభిప్రాయపడ్డారు. సరిగ్గా ఇదే విషయాన్ని మోహన్ దాస్ కూడా లేవనెత్తారు. ఫ్రెషర్లు, జూనియర్ ఉద్యోగులకు కంపెనీలు వేతన పెంపులను సరైన స్థాయిలో అందించటం లేదని ఈ సందర్భంగా అన్నారు. ఐటీ కంపెనీ సీఈవోల వేతనాల పెరుగుదలను పరిశీలిస్తే.. ఐదేళ్ల కిందటితో పోల్చినప్పుడు వారి వేతనాలు దాదాపు 50-60 శాతం మేర పెరిగినట్లు వెల్లడైంది. ఇదే సమయంలో ఎంట్రీ లెవెల్ స్థాయి ఉద్యోగుల వేతనాలు మాత్రం కేవలం 20 శాతం కంటే తక్కువగానే పెరగటంపై ప్రస్తుతం ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇక ఔట్ సోర్సింగ్ ఉద్యోగ పరిస్థితి దారణంగా ఉందని తెలుస్తోంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్పణానికి అనుగుణంగా వేతనాల పెంపు లేకపోవటంతో కింది స్థాయి ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను కంపెనీలు అర్థం చేసుకోవాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్: వారానికి 4 రోజులు ఆఫీసు నుంచే పని తప్పనిసరి! హైబ్రిడ్ మోడల్‌కు ముగింపు పలికిన కంపెనీ

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications