Jobs For Kannadigs: కర్ణాటక జాబ్ రిజర్వేషన్లపై Infosys మాజీ అధికారి కీలక వ్యాఖ్యలు..!!
Mohandas Pai: ఒకపక్క ప్రపంచం మెుత్తం గ్రోబలైజేషన్ విధానంలో అపరిమితంగా విస్తరిస్తున్న వేళ.. పక్కనే ఉన్న కర్ణాటక మాత్రం లోకలైజేషన్ అంటోంది. ఉద్యోగాల కల్పనలో అవకాశాలను కన్నడికులకు అందించాలంటూ ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. గతంలో ఇలాంటి ఆలోచనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం చేసి పరిశ్రమలకు సూచనలు చేశారు.
తాజాగా మంగళవారం రోజున కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కన్నడిగులకు రిజర్వు చేయాలని చేసిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 50 శాతం నుంచి గరిష్ఠంగా 100 శాతం ఉద్యోగాలు రిజర్వు చేయాలనే బిల్లుపై పరిశ్రమ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మేనేజ్మెంట్ రోల్స్ లో 50 శాతం, నాన్ మేనేజ్మెంట్ జాబ్స్ లో 70 శాతం ఉద్యోగాలను లోకల్ ప్రజలకు రిజర్వు చేయాలని నిర్ణయించింది. దీనికి తోడు ప్రభుత్వ ఉద్యోగాల్లో సీ, డీ గ్రేడ్ ఉద్యోగాలు పూర్తిగా 100 శాతం కన్నడికులకేనని కర్ణాటక సర్కార్ వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల ప్రతిభావంతులైన ఉద్యోగుల ఎంపికను కష్టతరం చేయటంతో పాటు పెట్టుబడులు సైతం రాష్ట్రానికి తగ్గుతాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

న్ఫోసిస్ మాజీ సీఈవో మోహన్‌దాస్ పై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రైవేటు రంగంలో ఉద్యోగాల్లో కోటా కేయింపు చట్టవిరుద్దమని, కఠినమైన బిల్లుగా పేర్కొన్నారు. ఇది రాష్ట్రం నుంచి వ్యాపారాలను తరలించడానికి, భవిష్యత్తులో పెట్టుబడులను నిరోధించేలా చేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగాల కోసం కన్నడిగులను ప్రోత్సహించాలనుకుంటే, ఉన్నత విద్యకు ఎక్కువ డబ్బు వెచ్చించాలన్నారు. అలాగే విద్యార్థులను మార్కెట్లోని పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్‌షిప్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలని తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా ప్రభుత్వానికి సూచించారు.
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా టెక్నాలజీ రంగంలో కర్ణాటక అగ్రస్థానం ప్రమాదంలో పడే అవకాశం ఉందని బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె బదులుగా అత్యంత నైపుణ్యం కలిగిన స్థానాలకు మినహాయింపులను కోరింది. ఇదే విషయంపై స్వర్ణ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ విఎస్‌వి ప్రసాద్ స్పందిస్తూ ప్రస్తుతం ఉన్న కార్మికుల కొరతను ఎత్తి చూపారు. ఇటువంటి ఆంక్షలు అంతిమంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిలిపివేస్తాయని, పరిశ్రమ మూసివేతకు సైతం దారితీస్తాయని హెచ్చరించారు.


Click it and Unblock the Notifications