IT News: కరోనా విజృంభణ నాటి నుంచి IT ఉద్యోగులు తీవ్ర అనిశ్చితిలో ఉన్నారు. అంతర్జాతీయ సంక్షోభాలు, యుద్ధ పరిస్థితుల నడుమ పలు దేశాల్లోని ప్రజలు ఖర్చులు తగ్గించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కాస్త IT ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపింది. లక్షలాదిమంది లేఆఫ్స్ బాధితులు కాగా ఫ్రెషర్స్ కథ మరోలా ఉంది.
ఏప్రిల్ 2002లో సెలక్షన్ లెటర్స్ ఇచ్చిన ఇన్ఫోసిస్.. ఇప్పటివరకు సదరు ఉద్యోగులను ఆన్ బోర్డ్ చేయలేదు. ఇది ఒక్క కంపెనీ నుంచో ఒక వ్యక్తికో ఎదురైన పరిస్థితి కాదు. వేల సంఖ్యలో ఫ్రెషర్లకు ఇలాంటి ఘటనలు ఎదురయ్యాయి. వీటిపై నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఇప్పటికే కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది.

రెండేళ్లుగా ఇన్ఫోసిస్ చేస్తున్న జాప్యం వల్ల వేలాదిమంది ఫ్రెషర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇతర కంపెనీలో ఆఫర్ వచ్చినా పెద్ద సంస్థలో జాబ్ వచ్చిందన్న కారణంగా వాటిని రిజెక్ట్ చేశామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇటు ఇన్ఫోసిస్ లోను అటు బయట కంపెనీల్లోనూ ఉపాధి లేక విలవిలాడుతున్నారు. కంపెనీని సంప్రదించిన ప్రతిసారి వ్యాపార అవసరాల ఆధారంగా ఆన్‌బోర్డ్ చేసుకుంటామని సిస్టం జనరేటెడ్ మెయిల్ మాత్రం వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా దాదాపు 2000 మందిని క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఇన్ఫోసిస్ సెలెక్ట్ చేసినట్లు NITES చెబుతోంది. వారికి 2022 ఏప్రిల్‌లో కన్ఫర్మేషన్ లెటర్లను అందించిననట్లు తెలిపింది. డిసెంబర్ 2002లో ఆన్ బోర్డ్ తేదీగా పేర్కోగా.. అప్పటినుంచి అవసరమైన సమయంలో హైర్ చేసుకుంటామంటూ సిస్టం జనరేటర్ మెయిల్స్‌ని పంపిస్తూ ఆన్ బోర్డ్ తేదీని జరుపుకుంటూ పోతునట్లు పేర్కొంది. ఇప్పటికీ రెండేళ్లు గడిపేయగా ఫ్రెషర్స్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలని పలువురు కోరుతున్నారు.


Click it and Unblock the Notifications