For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ఫోసిస్ శిబులాల్‌కు 4 లక్షలకు పైగా షేర్ల బహుమతి, గిఫ్ట్ ఇచ్చిందెవరో...

|

బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు శిబులాల్ 4 లక్షలకు పైగా కంపెనీ షేర్లను బహుమతిగా అందుకున్నారు. వీటితో కలిసి ప్రస్తుతం ఆయన వద్ద మొత్తం ఇన్ఫోసిస్ షేర్ల సంఖ్య 21.6 లక్షలు దాటింది. 4,01,000 ఈక్విటీ షేర్లను (0.01 శాతం) ఇన్ఫోసిస్ లిమిటెడ్ షేర్లను శిబులాల్‌కు కేటాయించినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది. అయితే ఈ షేర్లను ఎవరు బహుమతిగా ఇచ్చిందనే విషయం వెల్లడించలేదు. ఇన్ఫోసిస్ స్టాక్ గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే.

గుడ్‌న్యూస్... భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది: మూడీస్, వృద్ధి రేటు సవరణగుడ్‌న్యూస్... భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది: మూడీస్, వృద్ధి రేటు సవరణ

బహుమతి వివరాలు లేవు

బహుమతి వివరాలు లేవు

ఈ నెల 12న ఆఫ్ మార్కెట్ ట్రాన్సాక్షన్‌లో ఈ వాటా 0.01 శాతం. శిబులాల్ భార్య కుమారి 4.01 లక్షల షేర్లను అదే రోజు బహుమతిగా ఇచ్చినట్లు ఉన్నప్పటికీ.. స్వీకర్త వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఇన్ఫోసిస్‌లో కుమారి వాటా 0.21 శాతానికి తగ్గగా, శిబులాల్ వాటా 0.05 శాతానికి పెరిగింది. ఈ ట్రాన్సాక్షన్ తర్వాత కుమారి వద్ద 88,96,930, శిబులాల్ దగ్గర 21,66,768 ఇన్ఫోసిస్ షేర్లు ఉన్నాయి.

జూలైలో షేర్ల విక్రయం

జూలైలో షేర్ల విక్రయం

జూలై నెలలో శిబులాల్, కుటుంబ సభ్యులు 85 లక్షల షేర్లను విక్రయించారు. వీటి వ్యాల్యూ రూ.770 కోట్లు. ఈ మొత్తాన్ని దాతృత్వ కార్యకలాపాల కోసం, వివిధ సంస్థల్లో పెట్టుబడుల కోసం వినియోగించారు. ఎన్ఆర్ నారాయణమూర్తితో కలిసి శిబులాల్, మరో ఐదుగురు ఇన్ఫోసిస్‌ను 1981లో ప్రారంభించారు. 2011 నుండి 2014 వరకు ఆయన కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. సీఈవో, ఎండీ కంటే ముందు 2007 నుండి 2011 మధ్య చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు.

రూ.400 ఎగిసిన స్టాక్

రూ.400 ఎగిసిన స్టాక్

ఇన్ఫోసిస్ స్టాక్ ఇటీవల భారీగా పెరిగింది. శుక్రవారం రూ.1,123.90 వద్ద క్లోజ్ అయింది. శనివారం సాయంత్రం దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సమయంలో ఈ స్టాక్ ఒక శాతానికి పైగా ఎగిసి రూ.1,134 వద్ద ట్రేడ్ అయింది. కరోనా నేపథ్యంలో మార్చి 23న ఈ స్టాక్ రూ.530 దిగువకు పడిపోయింది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంది. 2020 జనవరిలో రూ.736 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. నాటి నుండి ఈ స్టాక్ ధర దాదాపు రూ.400 ఎగిసింది. మధ్యలో కరోనా సమయంలో రూ.526తో పోలిస్తే రూ.700 పెరిగింది.

English summary

ఇన్ఫోసిస్ శిబులాల్‌కు 4 లక్షలకు పైగా షేర్ల బహుమతి, గిఫ్ట్ ఇచ్చిందెవరో... | Infosys co founder Shibulal receives over 4 lakh company shares as gift

Infosys co-founder S D Shibulal has received little over four lakh shares of the company as a gift, taking the total number of shares owned by him to more than 21.6 lakh shares, according to a regulatory filing.
Story first published: Sunday, November 15, 2020, 11:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X