ఈ రోజుల్లో 'వర్క్ లైఫ్ బ్యాలెన్స్'పై చర్చ రోజుకో మలుపు తిరుగుతుంది. వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన ప్రకటనతో ఈ చర్చ మొదలైంది. అయితే తాజగా నారాయణమూర్తి కుటుంబ సంపద కేవలం 24 గంటల్లో దాదాపు రూ.1,900 కోట్లు తగ్గింది. నిన్న శుక్రవారం స్టాక్ మార్కెట్‌లో క్షీణత కనిపించిగా ఈ సమయంలో ఇన్ఫోసిస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. దింతో కంపెనీ మార్కెట్ క్యాప్ లేదా మార్కెట్ క్యాపిటలైజేషన్ పడిపోయింది.
నారాయణమూర్తి ఏం చెప్పారంటే?
భారతీయులు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కాకుండా పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి అన్నారు. వారానికి ఆరు రోజులు కాకుండా ఐదు రోజులు మాత్రమే పని చేసే సంప్రదాయాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. అంతేకాకూండా వారానికి 70 గంటలు పని చేయాలని ఆయన సూచించారు. ఆయన ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద దుమారం
చెలరేగింది. చివరికి పెద్ద పెద్ద దిగ్గజా కంపెనీ ప్రముఖులు కూడా ఇందులో భాగమైయ్యారు.

ఇన్ఫోసిస్ షేర్ల పతనం
శుక్రవారం బిఎస్‌ఇలో ఇన్ఫోసిస్ షేర్లు 5.8%తో భారీగా పడిపోయాయి. నిన్న సాయంత్రానికి ఇన్ఫోసిస్ షేరు రూ.1,815.10 వద్ద ముగిసింది. ఈ విధంగా నారాయణ మూర్తి కుటుంబ సంపదలో భారీ క్షీణత సంభవించింది ఇంకా అతని మొత్తం సంపద దాదాపు రూ.1,900 కోట్లు తగ్గింది. ఇన్ఫోసిస్‌లో మొత్తం 4.02% ఉన్న కుటుంబ వాటా, షేర్ల విక్రయం తర్వాత రూ.30,292 కోట్లకు తగ్గింది. ఈ విధంగా ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.53 లక్షల కోట్లకు తగ్గింది.
పెరిగిన రెండో పెద్ద ఐటీ కంపెనీ లాభం
భారతదేశపు రెండవ అతిపెద్ద ఐటి సేవల సంస్థ ఇన్ఫోసిస్ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను తాజాగా గురువారం ప్రకటించింది. కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 11% బలమైన వృద్ధిని కనబరిచినట్లు నివేదించింది. దీంతో కంపెనీ ప్రాఫిట్ రూ.6,806 కోట్లకు చేరింది. ఈ రిపోర్ట్ వచ్చిన ఒక రోజు తర్వాత స్టాక్ మార్కెట్‌లో ఊహించని గందరగోళం నెలకొంది. ఈ త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 8% పెరిగింది. దింతో రూ.41,764 కోట్లుగా మారింది.
కుటుంబం వాటా ఎంత?
గత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం వరకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు అండ్ ప్రమోటర్ ఎన్.ఆర్. ఐటీ మేజర్‌లో నారాయణ మూర్తికి 0.40% వాటా ఉండగా, అతని భార్య సుధా ఎన్ మూర్తికి 0.92% వాటా ఉంది. అతని కుమారుడు రోహన్ మూర్తికి కంపెనీలో 1.62% వాటా ఉండగా, అతని కుమార్తె UK మాజీ ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తికి 1.04% వాటా ఉంది.
నారాయణ మూర్తి మనవడు ఏకగ్రా రోహన్ మూర్తికి సెప్టెంబర్ త్రైమాసికం నాటికి ఇన్ఫోసిస్‌లో నామమాత్రంగా 0.04% వాటా ఉంది. మూర్తి కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులకి సెప్టెంబర్ త్రైమాసికం నాటికి ఇన్ఫోసిస్‌లో మొత్తంగా 4.02% వాటా ఉంది, నిన్న శుక్రవారం పతనం తర్వాత వీరి వాటా విలువ రూ. 30,292 కోట్లు. కంపెనీ స్టాక్ పతనానికి ముందు గురువారం వీరి వాటా విలువ రూ. 32,136 కోట్లు, అయితే స్టాక్ మార్కెట్ అమ్మకాల కారణంగా నికర విలువలో భారీ నష్టాన్ని సూచిస్తుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications