Infosys: ఇన్ఫోసిస్ మూర్తిపై ఐటీ ఉద్యోగులు సీరియస్.. విమర్శకుల నోటికి తాళం వేసిన 'పై'
Narayana Murthy: దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల కంపెనీగా ప్రస్తుతం ఇన్ఫోసిస్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. అయితే అనేక సంవత్సరాల కిందట దీనిని నారాణయ మూర్తితో పాటు మరికొందరు మిత్రులు కలిసి ప్రారంభించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఒక ఆలోచింపజేచే చర్చలో ఇన్ఫోసిస్ ఎన్ఆర్ నారాయణ మూర్తి పాల్గొన్నారు. దీనిలో తన అభిప్రాయాన్ని వెళ్లడిస్తూ.. భారతదేశంలోని యువత దేశ పని సంస్కృతిని పెంపొందించడానికి, ప్రపంచ వేదికపై సమర్ధవంతంగా పోటీ పడేందుకు వారానికి 70 గంటలు పని చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. అయితే ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీశాయి.

దేశాన్ని ముందుకు తీసుకువెళ్లటానికి యువత తమ పని ఉత్పాదకతను మార్చుకోవాల్సిన ఆవశ్యకతను మూర్తి 3one4 క్యాపిటల్ పాడ్‌కాస్ట్ 'ది రికార్డ్' ప్రారంభ ఎపిసోడ్‌లో నొక్కి చెప్పారు. ఎక్కువ పనిగంటలు వెచ్చించకపోతే కొన్ని దశాబ్ధాలుగా సాధించాలనుకుంటున్న ఆర్థిక పురోగతిని భారత్ చేరుకోవటంలో కష్టపడుతుందని అన్నారు. దేశంలో పని ఉత్పాదకత తక్కువగా ఉందని, ప్రపంచంలోనే అత్యల్ప ర్యాంక్‌లో ఉందని పేర్కొన్నారు. చైనా వంటి దేశాలతో అంతరాన్ని తగ్గించడానికి.. మూర్తి జపాన్, జర్మనీలు చరిత్రలో పుంజుకున్న విధానాన్ని గమనించాలన్నారు.
ఈ క్రమంలో దేశంలోని ప్రభుత్వాల అవినీతి, బ్యూరోక్రాటిక్ అసమర్థత వంటివి వృద్ధికి అవరోధాలుగా ఉన్నాయని అన్నారు. దీనిపై ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, సీఈవో భవీష్ అగర్వాల్ స్పందిస్తూ మూర్తి ఆలోచనలతో తాను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. అయితే మరోపక్క కొందరు మూర్తి వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది భారతీయ స్వీట్ షాపులు నడిపే యజమానుల ఆలోచనా ధోరణి అని అభిజిత్ ఐయంగార్ మిత్రా అనే నెటిజన్ అన్నారు. అందుకే ఇన్ఫోసిస్ తక్కువ విలువ కలిగిన పేరుగాంచిన ఐటీ కూలీగా మారిందంటూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన మోహన్‌దాస్ పై ఇన్ఫోసిస్ నిర్మాణం, పనితీరు, వ్యాపారం గురించే తెలియకుండా వ్యాఖ్యలు చేయెుద్దని అన్నారు. మీరు కూడా 20 బిలియన్ డాలర్ల కంపెనీని నిర్మించి ఆ తర్వాత నోరు తెరిత్సే బాగుంటుందని అన్నారు.


Click it and Unblock the Notifications