EPFO: పండగ సమయానికి పీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ అవుతుందని చాలా మంది భావించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవటంతో నిరాశకు గురవుతున్నారు. మారిన టాక్స్ నియమాలకు అనుగుణంగా EPFO సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. అయితే సెటిల్‌మెంట్ లేదా విత్‌డ్రా చేస్తున్న వారికి వడ్డీతో సహా డబ్బులు చెల్లిస్తోంది.
వడ్డీ రాలేదంటూ ఫిర్యాదు..
ఈ క్రమంలో పీఎఫ్ పై వడ్డీ ఇంకా రాలేదంటూ.. ఇన్ఫోసిస్ కోఫౌండర్ టీవీ మోహన్‌దాస్ పాయ్ చేసిన ట్వీట్‌పై ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆయన తన ట్వీట్ లో పీఎంఓను, ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేస్తూ.. మనకు సంస్కరణలు అవసరమని అన్నారు. అధికారుల అసమర్థతకు ప్రజలు ఎందుకు బాధింపబడాలి? అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈపీఎఫ్ కింద సుమారు 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. అందువల్ల ఇది చాలా మందికి సంబంధించిన విషయం.
40 ఏళ్లలో అత్యల్ప వడ్డీ..
ఈసారి కేంద్ర ప్రభుత్వం పీఎఫ్‌పై 8.10 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఇందుకోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మార్చిలో చేసిన సిఫారను జూన్‌లో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత 40 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే.. EPFO 1977-78లో అత్యల్పంగా 8 శాతం వడ్డీని అందించింది. ఆర్థిక చట్టం 2021లో కొత్త నిబంధన ప్రకారం ఎవరైనా ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్‌కు ఏడాదిలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ జమ చేస్తే.. EPF వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాలెన్స్ చెక్ చేసుకోవటం..
PF ఖాతా బ్యాలెన్స్ ఇంట్లో కూర్చొని ఆన్ లైన్ లో తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు EPFO అధికారిక వెబ్‌సైట్ epfindia.gov.inకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఈ-పాస్‌బుక్‌పై క్లిక్ చేయాలి. దీని తర్వాత ఉద్యోగి UAN నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ప్రక్రియను పూర్తి చేయాలి. అక్కడ మెంబర్ షిప్ ఐడీపై క్లిక్ చేయగానే E-పాస్‌బుక్‌లోని బ్యాలెన్స్ వివరాలు కనిపిస్తాయి.

మిస్డ్ కాల్స్, SMS..
PF ఖాతాతో లింక్ చేయబడిన నంబర్ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే.. రిజిస్టర్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. అందులో PF బ్యాలెన్స్ సమాచారం ఉంటుంది. ఈ వివరాలను మీరు SMS ద్వారా కూడా పొందవచ్చు. ఇందుకోసం ముందుగా EPFOHO UAN రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి SMS పంపి కూడా బ్యాలెనస్ సమచారాన్ని పొందవచ్చు.

యాప్ ద్వారా..
యాప్ ద్వారా బ్యాలెన్స్ తెలుసుకునేందుకు ముందుగా UMANG యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోన్ నంబర్‌ను నమోదు చేసి యాప్‌కి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత సర్వీస్ డైరెక్టరీలోని EPFO ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత వ్యూ పాస్‌బుక్‌కి వెళ్లి.. UAN నంబర్, OTP వివరాలు పొందుపరిచి కూడా తెలుసుకోవచ్చు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications