Infosys: ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడిపై ఎస్సీఎస్టీ కేసు.. అసలు ఏమైంది..?
Kris Gopalakrishnan: కర్ణాటక పోలీసులు ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడిపై కేసు నమోదు చేయటం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ తో పాటు ఇండియన్ ఇన్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ మాజీ డైరెక్టర్ బలరాం పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వీరిద్దరితో పాటు మరో 16 మందిపై కేసు నమోదు చేసినట్లు బెంగళూరు పోలీసులు సోమవారం వెల్లడించారు. 71వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు సదాశివ నగర్ పోలీస్ స్టేషన్‌లో వీరిపై కేసు నమోదు చేయబడింది. క్రిస్ గోపాలకృష్ణన్ ట్రస్టీల బోర్డు సభ్యుడిగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో తనను హనీ ట్రాప్ కేసులో తప్పుగా ఇరికించారని, తనను పని నుంచి తొలగించారని ఒక వ్యక్తి ఫిర్యాదు చేయటంతో ప్రస్తుత కేసు నమోదైంది.

క్రిస్ గోపాలకృష్ణన్ పై కేసు నమోదు చేసిన వ్యక్తి దుర్గప్ప బోయ గిరిజన జాతికి చెందిన వ్యక్తిగా వెల్లడైంది. ఐఐఎస్సీలోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీలో ఫ్యాకల్టీ సభ్యుడిగా ఉన్న దుర్గప్ప 2014లో తనను హనీ ట్రాప్ కేసులో తప్పుగా ఇరికించారని ఫిర్యాదులో వెల్లడించాడు. ఈ నెపంతో తనను ఉద్యోగం నుంచి అక్రమంగా తొలగించారని వాపోయాడు. తనపై కుల వివక్ష చూపారని, తాను బెదిరింపులకు సైతం గురయ్యానని దుర్గప్ప ఈ కేసులో ఆరోపణలు చేయటంతో ప్రస్తుత చర్యలు వచ్చాయి.
క్రిస్ గోపాలకృష్ణన్ వాస్తవానికి ఇన్ఫోసిస్ కంపెనీలో వైస్ చైర్మన్ స్థాయిలో 2011-2014 వరకు సేవలు అందించారు. అలాగే కంపెనీకి సీఈవో, ఎండీగా 2007 నుంచి 2011 వరకు వ్యవహరించారు. అలాగే ఆయన 2013-2014 వరకు కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా కూడా ఎన్నికయ్యారు. అలాగే జనవరి 2014లో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సహ-అధ్యక్షుల్లో ఒకరిగా కూడా వ్యవహరిస్తున్నారు.
2011లో గోపాలకృష్ణన్ భారత ప్రభుత్వం అందించే విసిష్ట పద్మ భూషన్ అవార్డును కూడా అందుకున్నారు. వాస్తవానికి ఇది దేశంలోని ప్రజలకు అందించే మూడవ అత్యుత్తమ పౌర పురస్కారం. అలాగే ఆయన ఐఐటీ నుంచి పట్టభద్రులయ్యారు.


Click it and Unblock the Notifications