Nandan Nilekani: చాలా కాలంగా దేశీయ ఐటీ రంగంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. దీనికి అసలు కారణం ఏఐ వినియోగం పెరుగుదలే కారణంగా ప్రచారం జరుగుతోంది. మరోపక్క టెక్ కంపెనీలు సైలెంట్ గా ఉద్యోగులను తొలగించటం, కొత్త నియామకాలను నిలిపివేయటం ఐటీ పరిశ్రమలో పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.
వాస్తవానికి అందరిలో ఉన్న భయంతో ఏఐ సాంకేతికత కారణంగా అనేక మంది టెక్కీలు ఉద్యోగాలను కోల్పోతారని భావిస్తున్నారు. అయితే ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య తగ్గడానికి వాస్తవంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణం కాదని ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ అండ్ ఇన్ఫోసిస్ చైర్మన్‌గా పని చేస్తున్న నందన్ నీలేకని ఈ విషయంపై స్పందించారు. టెక్కీలు ఉద్యోగాలు కోల్పోవటానికి ఏఐ ఒక్కటే కారణం కాదని అన్నారు.

ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాల తగ్గింపుకు ప్రధాన కారణం.. గత కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్ కంపెనీల విచక్షణ వ్యయం తగ్గుముఖం పట్టిందన్నారు. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి ఎలాంటి సంబంధం లేదని నీలేకని స్పష్టం చేసింది. అయితే కొత్త టెక్నాలజీ వల్ల ఉద్యోగ నష్టాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా కొన్ని ఉద్యోగాలు పోతాయని, దీర్ఘకాలంలో చూస్తే అవి కొత్త ఉద్యోగాల సృష్టికి దారితీస్తుందని అన్నారు. అయితే ప్రస్తుతం ఏఐపై ఉన్న కొన్ని అనుమానాలు నిజమేనని పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు మెరుగైన మార్గంలో సేవలు అందించవచ్చని తెలిపారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో దేశం చాలా లాభపడిందని పేర్కొన్న నందన్ నీలేకని ఆధార్, యూపీఐ మన జీవన విధానాన్ని మార్చాయన్నారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సానుకూల మార్పులు తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజలు డబ్బు ఖర్చు చేసి ఇలాంటి భాషా నమూనాలను సృష్టించడం ముఖ్యం కాదు. వాటిని మనం ఎలా ఉపయోగిస్తాం అన్నదే ముఖ్యం. దీని మీద భారతదేశం దృష్టి పెట్టాలని నందన్ నీలేకని ఉద్ఘాటించారు.


Click it and Unblock the Notifications