దేశంలో అత్యధికంగా జీతాలు అందించే రంగం ఏదైనా ఉందంటే అది టెక్ రంగమేనని చెప్పుకోవచ్చు. ఈ రంగంలో ఉద్యోగుల జీతాలు భారీగా ఉంటాయి. ఇక కంపెనీల సీఈఓ జీతం అయితే చెప్పనక్కర లేదు. కోట్లలోనే పారితోషికం ఉంటుంది. ఉద్యోగుల జీతాల కన్నా వందల రెట్లు అధికంగా సీఈఓల జీతాలు ఉంటాయి.మొన్నటికి మొన్న విప్రో, టీసీఎస్ సీఈఓల జీతాలు బయటకు రాగా తాజాగా ఇన్ఫోసిస్ సీఈఓ జీతం కూడా బయటకు వచ్చింది. దీని ప్రకారం ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ జీతం ఈ ఏడాది భారీగా పెరిగింది.
ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన సలీల్ పరేఖ్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీతంగా రూ.80.62 కోట్లను అందుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయన జీతం 21.6 శాతం పెరిగింది. ఈ విషయం కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడయింది. కాగా గత ఏడాది ఇన్ఫోసిస్ సీఈఓ రూ.66.25 కోట్ల జీతంగా అందుకున్నారు.ఇక 2022 ఆర్థిక సంవత్సరంలో పరేఖ్ జీతం రూ.71 కోట్లుగా ఉండగా, 2023 ఆర్థిక సంవత్సరంలో అది రూ.56 కోట్లకు తగ్గిపోయింది.

కంపెనీ వార్షిన నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక జీతం కింద ఆయన రూ.7.45 కోట్లు అందుకోనున్నారు. అలాగే రిటైర్మెంట్ ప్రయోజనాల కింద మరో రూ.49 లక్షలు తీసుకోనున్నారు. బోనస్, ప్రోత్సాహకాలుగా రూ.23.18 కోట్లు, ఇక షేర్ ఆప్షన్ల ద్వారా రూ.49.5 కోట్లు ఆయన తీసుకుంటారని కంపెనీ నివేదిక తెలిపింది. మొత్తం స్థిర జీతంగా ఆయన రూ.7.94 కోట్లు తీసుకుంటున్నారు. ఇన్ఫోసిస్ సీఈఓగా సలీల్ పరేఖ్ జనవరి 2018లో బాధ్యతలు చేపట్టారు.
ఇతర కంపెనీల సీఈఓల జీతాల విషయానికి వస్తే.. విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 53.64 కోట్లు జీతంగా అందుకున్నారు. ఇక టీసీఎస్ సీఈఓ కె కృతివాసన్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 26.52 కోట్లను జీతంగా పొందారు.మరో టైకూన్ ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ ఎం నీలేకని కంపెనీకి అందించిన సేవలకు గానూ ఎటువంటి పారితోషికం తీసుకోకూడదని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి.
సలీల్ పరేఖ్ ఇన్ఫోసిస్ కంపెనీ ఉద్యోగుల సగటు వేతనం (రూ. 10.72 లక్షలు) కంటే 752 రెట్లు ఎక్కువ జీతంగా అందుకున్నారు. వాటాదారులకు ఆయన రాసిన లేఖలో ఇన్ఫోసిస్ క్లయింట్లకు AI, క్లౌడ్, డేటా, డిజిటల్ రంగాలలో ప్రముఖ స్థానంలో ఉందని తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 15,000 మంది ఉద్యోగులను తీసుకుందని ఆయన తెలిపారు. ఇక సంవత్సరాంతానికి ఉద్యోగుల సంఖ్య 3.2 లక్షలకు పైగా పెరిగిందనన్నారు.
ఇదిలా ఉంటే మైసూర్ క్యాంపస్ నుండి వందలాది మంది ట్రైనీలను తొలగించడం సంచలనంగా మారిన సంగతి విదితమే.ఇక వేరియబుల్ పేలో కోత విధించడం, ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చితి మధ్య ఈ జీతాల పెంపుదల రావడం గమనించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు.
More From GoodReturns

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

IT Jobs: కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఆగండి! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఓసారి చూడండి!

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications