సాఫ్టువేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ సీఈవో సలీల్ పరేఖ్‌కు ఈ సంస్థ బారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. దాదాపు రూ.3.25 కోట్ల విలువైన షేర్లను కేటాయించింది. 2015లో ఇన్సెంటివ్ కాంపన్సేషన్ ప్లాన్ కింద వీటిని కేటాయించింది. ప్రస్తుతం కంపెనీకి ఉన్న రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్ (RSU) నుండి వీటిని కేటాయించింది. కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావుకు 58,650 RSU వాటాను కేటాయించింది.

అయిదుగురికి..
ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్‌కు రూ.3.25 కోట్ల విలువైన షేర్లను, కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావుకు 58,650 RSU వాటాలను కేటాయించినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఇన్సెంటివ్ కాంపన్సేషన్ ప్లాన్ కింద మొత్తం అయిదుగురు కీలక వ్యక్తులకు 3,53,270 RSUలను కేటాయించింది. వీటికి కనీసం నాలుగేళ్ల వెస్టింగ్ పీరియడ్ ఉంటుంది.

మరో ఆరుగురికి PSU
ఎక్స్‌పాండింగ్ స్టాక్ ఓనర్షిప్ ప్రోగ్రాం 2019 ప్రకారం ఆరుగురు కీలక వ్యక్తులకు 1,69,000 ప్రిఫరెన్షియల్ స్టాక్స్ యూనిట్ (PSU)లను కేటాయించింది ఇన్ఫోసిస్. అర్హత ఉన్న మరో 411 మందికి 17,76,500 PSUలను కేటాయించింది.

371 మంది అర్హత కలిగిన ఉద్యోగులకు..
RSU స్కీం కింద మొత్తం 371 అర్హత కలిగిన ఉద్యోగులకు 1,487,150 RSUలు కేటాయించినట్లు ఫైలింగ్‌లో ఇన్ఫోసిస్ తెలిపింది. కంపెనీ పర్ఫార్మెన్స్ ప్రోగ్రాం కింద పనితీరు ఆధారంగా షేర్లు కేటాయిస్తారు. స్టాక్ ఇన్సెంటివ్స్ను ఫిబ్రవరి 27, 2020 తేదీతో అందించింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications