ఇన్ఫోసిస్ బీపీఎం డబుల్: 1 బిలియన్ డాలర్ల ఆదాయం!
బెంగళూరు: ఇన్ఫోసిస్ బీపీఎం ఆదాయం ఈ ఏడాది రెట్టింపు కానుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 1 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. తాజా విలీనాలతో బ్యాంకింగ్, బీమా రంగాల్లో దీని వ్యాపారం విస్తరించింది.
మే నెలలో ABM AMROకు చెందిన స్టార్టర్‌లో 75 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ సంస్థ బెల్జియంలో బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. అలాగే, అక్టోబర్ నెలలో 1400 మంది ఉద్యోగులు ఉన్న ఏర్లాండ్ Eischtecను కొనుగోలు చేసింది. ఈ కంపెనీకి టెలికం, సోషల్ మీడియా, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాల్లో క్లయింట్లు ఉన్నారు.

ఇప్పుడు ఈ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో 1 బిలియన్ రెవెన్యూను అంచనా వేస్తున్నట్లు ఇండస్ట్రీ కన్సల్టెన్సీ HfS రీసెర్చ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫిల్ ఫెర్ష్ట్ తెలిపారు. ఇన్ఫోసిస్ బీపీఎం ఫైనాన్స్, ప్రొక్యూర్మెంట్ బ్యాంక్ ఆఫీస్ సేవల్లో భారీగా విస్తరిస్తోందని ఫిల్ ఫెర్ష్ట్ అన్నారు.
ఈ సంస్థకు ఇప్పటికే బీమా రంగంలో మంచి పేరు ఉంది. స్టాటర్ కొనుగోలుతో బ్యాంకింగ్ రంగంలో విస్తరించింది. ఇప్పటికే ఇన్ఫోసిస్‌కు వ్యూహాత్మకంగా చాలామంది వినియోగదారులు ఉన్నారు. దీంతో ఐటీ సేవల కంపెనీ కన్నా ఎక్కువ వృద్ధి రేటును నమోదు చేస్తోంది. వినియోగదారులు టెక్నాలజీలో మార్పులు చేసుకుంటుండటంతో బ్యాక్ ఆఫీస్ సేవల సంస్థలు రెండెంకెల వృద్ధి రేటును నమోదు చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications