Cognizant News: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ గడ్డు కాలంలో ఎదురుదెబ్బలు తింటోంది. ఈ క్రమంలో మరో టెక్ కంపెనీ కాగ్నిజెంట్ తో వివాదంలో పడింది.
వివరాల్లోకి వెళితే కాగ్నిజెంట్ అనైతిక ఉద్యోగుల వేట వ్యూహాలను అమలు చేస్తోందంటూ భారతీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆరోపిస్తోంది. దీంతో రెండు కంపెనీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇన్ఫోసిస్ సైతం తన ప్రత్యర్థి సంస్థ విప్రో బాటలోనే నడుస్తోంది. ఎందుకంటే రెండు కంపెనీల నుంచి కాగ్నిజెంట్ ఇటీవలి కాలంలో ప్రతిభావంతులైన అగ్రశ్రేణి ఉద్యోగులను ఆకట్టుకోవటంతో అసలు వివాదం మెుదలైంది.

తాజాగా ఇన్ఫోసిస్ సీనియర్ నాయకులు కొంతమంది కాగ్నిజెంట్ సంస్థలో చేరడానికి బయలుదేరటంతో లేఖ రాసినట్లు సమాచారం. ఈ ఏడాది జనవరిలో కాగ్నిజెంట్ సీఈవోగా రవి కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పోటీ కంపెనీల నుంచి ఉద్యోగుల నియామకాలు భారీగా పెరిగాయి. వాస్తవానికి రవి కుమార్ ఇన్ఫోసిస్ కంపెనీలో ఉన్నత స్థాయి అనుభవజ్ఞుడైన అధికారుల్లో ఒకరు. ఆయన సీఈవోగా మారిన తర్వాత 20 మందికి పైగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌లను, నలుగురు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌లను నియమించగా వారిలో చాలా మంది విప్రో, ఇన్ఫోసిస్‌లకు చెందినవారు కావటం వివాదకర వాతావరణాన్ని నెలకొల్పింది.
ప్రస్తుతం విప్రో మాజీ సీఎఫ్ఓ జతిన్ దలాల్ కాగ్నిజెంట్ కంపెనీలో చేరటం వివాదకరంగా మారింది. దీనిపై విప్రో కోర్టును ఆశ్రయిస్తూ కేసు నమోదు చేసింది. దావాకు కారణాలు అనిశ్చితంగా ఉన్నప్పటికీ, తదుపరి విచారణ జనవరిలో జరగనుంది. దేశంలో 4వ అతిపెద్ద IT సర్వీస్ ప్రొవైడర్ అయిన విప్రోలో 21 సంవత్సరాలకు పైగా పనిచేసిన తరువాత సెప్టెంబర్‌లో దలాల్ తన రాజీనామాను ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి కాగ్నిజెంట్‌లో చేరటంతో విప్రో ప్రధాన కార్యాలయం ఉన్న బెంగళూరులోని సివిల్ కోర్టులో దలాల్‌పై ఫిర్యాదు దాఖలైంది. ఆ తర్వాత దలాల్ ఒక దరఖాస్తును దాఖలు చేశారు.


Click it and Unblock the Notifications