Infosys: భారతీయులను నియమించుకోవద్దన్న ఇన్ఫోసిస్.. అమెరికా కోర్టుకు విషయం.. ఎందుకిలా..?
Infosys: ఈ మధ్య కాలంలో భారతీయ ఐటీ కంపెనీలు చేస్తున్న అనేక పిచ్చి పనులు మెల్లగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా భారత సమతతికు చెందిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవద్దని కంపెనీ యాజమాన్యం చెప్పిన విషయం పెద్ద వివాదానికి దారితీసింది. ఇంట్లో పిల్లలున్న మహిళలను, 50 ఏళ్లు దాటిన అభ్యర్థులను ఉద్యోగాల్లోకి నియమించుకోవద్దని కంపెనీ మౌకిక ఆదేశాలు జారీ చేసింది.
బెంగళూరు ఆదేశాలు..
ఐటీ సంస్థ బెంగళూరు ప్రధాన కార్యాలయం నియామకాల విషయంలో పై సూచనలు చేసిందని ఇన్ఫోసిస్‌లోని టాలెంట్ అక్విజిషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జిల్ ప్రీజీన్ అమెరికా కోర్టుకు తెలిపారు. యూఎస్‌లో నియామక పద్ధతుల్లో వివక్ష చూపుతున్నట్లు భారతీయ ఐటి కంపెనీ ఆరోపణలు ఎదుర్కోవడం ఇది రెండోసారి. ఈ క్రమంలో యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ కోర్టులో జిల్ ప్రీజీన్ వేసిన దావాను కొట్టేయాలని ఇన్ఫోసిస్ వేసిన మోషన్‌ను కోర్టు తిరస్కరించింది.

మూడు వారాల్లో బదులివ్వాలంటూ..
ఈ దావా విషయంలో 21 రో్జుల్లోపు సమాధానం ఇవ్వాలని ఇన్ఫోసిస్‌ను ఆదేశించింది. గత నెల 30న న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇన్ఫోసిస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇన్ఫోసిస్ మహిళల పట్ల వివక్ష ప్రదర్శించటంపై జిల్ ప్రీజన్ ఆరోపించారు. భారతీయ మహిళల నియామకం పట్ల లింగ వివక్ష ప్రదర్శించడం న్యూయార్క్ సిటీ మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడమేనని వాదించారు. 2018లో ఉద్యోగం కోసం ఆమెను నియమించినప్పుడు ఆమె వయసు 59 ఏళ్లుగా ఉంది.

ఉద్యోగం కోల్పోయానని..
కంపెనీ పక్షపాత దోరణి కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయినట్లు ప్రీజీన్ తన ఫిర్యాదులో వెల్లడించారు. ఇది పూర్తిగా మానవ హక్కుల చట్టాల ఉల్లంఘన అని ఆమె తెలిపారు. తాను చట్టానికి లోబడి పని చేయాలని డిమాండ్ చేస్తూ లివింగ్‌స్టన్ ముందు పిటిసన్ దాఖలు చేయగానే తనను ఇన్ఫోసిస్ ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆమె తెలిపారు. అయితే ప్రీజన్ అభియోగాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేనందున దానిని తోసిపుచ్చాలని ఇన్ఫోసిస్ కోర్టును కోరింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావటంతో ఐటీ ఉద్యోగుల్లో ఆగ్రహం మెుదలైంది.


Click it and Unblock the Notifications