Bumper IPO: ఐపీవో రికార్డు.. తొలిరోజే ఇన్వెస్టర్ల సంపద డబుల్..
Bumper IPO: ఈరోజు మార్కెట్లోకి అడుగుపెట్టిన ఐపీవో ఇన్ఫోలియన్ రీసెర్చ్ సర్వీసెస్ లిమిటెడ్ తొలిరోజే రికార్డుల మోత మోగించింది. దీంతో ఇన్వెస్టర్ల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.
ఎస్ఎమ్ఈ కేటగిరీలో లిస్ట్ అయిన స్టాక్ ఇన్ఫోలియన్ రీసెర్చ్ మార్కెట్లో మంచి ధరకు నేడు లిస్ట్ అయ్యింది. అత్యంత చౌక ధరకు వచ్చిన స్టాక్ రెండు రెట్లు కంటే ఎక్కువ రాబడిని పెట్టుబడిదారులకు అందించింది. ఐపీవో ప్రైస్ బ్యాండ్ రూ.80-82గా కంపెనీ నిర్ణయించింది. అయితే స్టాక్ రూ.209 రేటు వద్ద మార్కెట్లోకి లిస్ట్ చేయబడి తొలి అడుగులోనే 150 శాతానికి పైగా రిటర్న్ అందించింది.

రూ.209 రేటుకు లిస్ట్ అయిన తర్వాత స్టాక్ ఇంట్రాడేలో గరిష్ఠంగా రూ.218 రేటును తాకింది. ఈ క్రమంలో ఒక్కో షేరుపై పెట్టుబడిదారులకు రూ.116 లాభం వచ్చింది. అయితే ఆ తర్వాత స్టాక్ దాదాపు 10 శాతం క్షీణించింది. అనేక మంది తొలిరోజే లాభాల స్వీకరణకు మెుగ్గు చూపటంతో ఇన్ఫోలియన్ రీసెర్చ్ సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్ రూ.198.55 వద్ద ట్రేడింగ్ ముగించింది.

ఇన్ఫోలియన్ రీసెర్చ్ సర్వీసెస్ లిమిటెడ్ IPO సబ్‌స్క్రిప్షన్ కోసం 29 మే 2023న తెరవబడింది. మే 31 వరకు సబ్‌స్క్రైబ్ చేసుకునేందుకు తెరచి ఉంది. ఈ క్రమంలో ఐపీవో దాదాపు 304 సార్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ చేయబడింది. 2009లో స్థాపించబడిన ఇన్‌ఫోలియన్ రీసెర్చ్ సర్వీసెస్ అనేది B2B హ్యూమన్ క్లౌడ్ విభాగంలో పనిచేస్తోంది. అగ్రశ్రేణి గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థలు, ప్రఖ్యాత ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌లు, హెడ్జ్ ఫండ్‌లు, మధ్య స్థాయి కార్పొరేట్ కంపెనీలకు సేవలను అందిస్తోంది.


Click it and Unblock the Notifications