Mutual Funds: రూటు మార్చిన ఇన్వెస్టర్లు.. ఆ మ్యూచువల్ ఫండ్స్‌లో తగ్గిన పెట్టుబడులు..
Equity Mutual Funds: కరోనా తర్వాత చాలా మంది ఇన్వెస్టర్లు తమ డబ్బును స్టాక్ మార్కెట్లలో ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. ఈ క్రమంలో తమ నష్టాలను తగ్గించుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకుంటున్నారు.
కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు 22 శాతం క్షీణించినట్లు నవంబర్ డేటా వెల్లడించింది. ఈక్విటీ స్కీమ్స్ లో పెట్టుబడుల ప్రవారం 22.15 శాతం నెల వారీగా రూ.19,957 కోట్ల నుంచి రూ.15,536 కోట్లకు తగ్గినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా(AMFI) డేటా వెల్లడించింది. ఈ ఏడాది మెుత్తాన్ని పరిశీలిస్తే ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు రూ.1.45 లక్షల కోట్లకు చేరుకున్నట్లు తేలింది.

ఈ సంవత్సరం ఇప్పటివరకు బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు నిఫ్టీ-50, బీఎస్ఈ సెన్సెక్స్, స్మాల్ అండ్ మిడ్-క్యాప్‌లు తాజా ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. గ్లోబల్ రేట్ ఆందోళనలను తగ్గించడం, బలమైన స్థూల ఆర్థిక డేటా సహాయంతో మార్కెట్లలో భారీ ర్యాలీ కొనసాగింది. నవంబర్ మాసంలో దీపావళి పండుగ, బ్యాంక్ సెలవులు వంటి అధిక సెలవుల కారణంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు ప్రభావితం అయి ఉండొచ్చని కోటక్ మ్యూచువల్ ఫండ్‌లో సేల్స్, మార్కెటింగ్, డిజిటల్ బిజినెస్ హెడ్ మనీష్ మెహతా అన్నారు.
నవంబర్ నెలలో స్మాల్-క్యాప్ ఫండ్‌లు రూ.3,699.24 కోట్ల గణనీయమైన ఇన్‌ఫ్లోలను చూశాయి. అక్టోబర్‌లో నమోదైన రూ.4,495.13 కోట్ల కంటే కొంచెం తక్కువని చెప్పుకోవాలి. దీని తర్వాత మిడ్-క్యాప్ కేటగిరీ రూ.2,665.73 కోట్ల పెట్టుబడులతో రెండో అత్యధిక ఇన్‌ఫ్లోను కలిగి ఉన్నాయి.
AMFI డేటా ప్రకారం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ల(SIPలు) పరంగా నవంబర్‌లో చందాలు రూ.17,073.30 కోట్ల చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. SIP ఖాతాల సంఖ్య 1.41 మిలియన్లు పెరిగి 74.41 మిలియన్ల ఆల్ టైమ్ హైకి చేరుకుంది. అలాగే ELSS కేటగిరీకి నవంబర్ నెలలో అత్యల్పంగా రూ.104.40 కోట్లు వచ్చాయి.


Click it and Unblock the Notifications