ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి తగ్గిన ఇన్-ఫ్లో, ఏప్రిల్‌లో రూ.3,400 కోట్లు
ఏప్రిల్ నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ.3,437 కోట్లు వచ్చాయి. వరుసగా రెండో నెల కూడా వీటల్లోకి పెట్టుబడులు వచ్చాయి. అయితే మార్చి నెలలో వచ్చిన రూ.9115 కోట్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా డేటా మంగళవారం వెల్లడించింది. అంతకుముందు 2020 జూలై నుండి 2021 ఫిబ్రవరి నెల వరకు వీటిల్లో నుండి పెట్టుబడులు తరలి వెళ్లాయి. కానీ మార్చి, ఏప్రిల్ నెలల్లో పెట్టుబడులు వచ్చాయి. కానీ మార్చి కంటే ఏప్రిల్ నెలలో భారీగా క్షీణించాయి.
ఈక్విటీస్‌ను మినహాయిస్తే ఇన్వెస్టర్లు రూ.1 లక్ష కోట్ల మేర గత నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు పెట్టారు. మార్చి నెలలో రూ.52,528 కోట్ల మేర ఉపసంహరించుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీకి అన్ని సెగ్మెంట్లలో కలిసి రూ.92,906 కోట్లు వచ్చాయి. మార్చి నెలలో మాత్రం రూ.29,745 కోట్లు తరలి వెళ్లాయి.

ఈక్విటీ, ఈక్విటీ లింక్డ్ ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్ ఇన్‌ఫ్లోస్ ఏప్రిల్ నెలలో రూ.3,437.37 కోట్లుగా ఉంది. మొత్తంగా ఈక్విటీ స్కీమ్స్‌ల్లో జనవరిలో రూ.9,253 ఔట్ ఫ్లో, డిసెంబర్‌లో రూ.10,147 ఔట్ ఫ్లో, నవంబర్ నెలలో రూ.12,917 ఔట్ ఫ్లో, అక్టోబర్ నెలలో రూ.2,725 ఔట్ ఫ్లో, సెప్టెంబర్ నెలలో రూ.734 ఔట్ ఫ్లో, ఆగస్ట్ నెలలో రూ.4,000 ఔట్ ఫ్లో, జూలై నెలలో రూ.2,480 కోట్ల ఔట్ ఫ్లో కనిపించింది.


Click it and Unblock the Notifications