ఆ రెండు కారణాలతో కంపెనీల రేటింగ్స్ డౌన్‌గ్రేడ్.. చావుదెబ్బ తింటున్న MSMEలు..
RBI Rates Hike: ప్రస్తుతం ఇండియాలో ద్రవ్యోల్బణం తగ్గేదె లే అన్నట్లు మెుండిగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ద్రవ్యవిధాన చర్యల్లో భాగంగా రిజర్వు బ్యాంక్ అనేక మార్లు కీలక రెపో రేటును పెంచుతూ వచ్చింది. అయితే ఈ రెండింటి కలయిక ఇప్పుడు దేశీయ కంపెనీలకు కష్టాలను తెచ్చిపెడుతోంది.
ఈ రెండు కారణాలతో కంపెనీల వృద్ధిని తగ్గించటం, క్రెటిడ్ రేషియోలపై బరువు పెరగటంతో దేశంలోని చాలా కంపెనీల రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేయబడ్డాయి. ప్రధానంగా 2022-23 ఆర్థిక సంవత్సరం రెండవ అర్థ భాగంలో అధిక కంపెనీలు దీనిని ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో చాలా కంపెనీలు డౌన్ గ్రేడింగ్ ఎదుర్కొన్నట్లు ప్రఖ్యాత రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ వెల్లడించింది. గడచిన పదేళ్ల సగటు కాలాన్ని పరిశీలించినప్పటికీ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

ఇదే క్రమంలో అధిక ద్రవ్యోల్బణం కారణంగా కమోడిటీల రేట్లు చాలా ఓలటైల్ గా మారాయి. ప్రధానంగా సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు(MSME) వీటివల్ల అధికంగా ప్రభావితమయ్యాయి. ఎగుమతి ఆధారిత రంగాల్లోని కంపెనీలు ప్రతికూల మార్కెట్ పరిస్థితుల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని CRISIL రేటింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ గుర్‌ప్రీత్ ఛత్వాల్ అన్నారు. పైగా డౌన్ గ్రేడ్ అయిన కంపెనీల్లో ఎక్కువగా MSMEలు ఉన్నాయి. లాభదాయకత, లిక్విడిటీ వంటి కారణాలు దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
కరోనా మహమ్మారి సమయంలో పాలసీ నిర్ణయాల వల్ల ఎమ్ఎస్ఎమ్ఈలు ఎక్కుగా ప్రయోజనాన్ని పొందాయి. అయితే ప్రస్తుతం అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల, క్రమంగా పెరుగుతున్న వడ్డీ రేట్లతో పోరాడుతున్నాయి. నిర్మాణ వస్తువులు, ఆహార ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్, గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లు మొదలైన అనేక రంగాలు వ్యయ ద్రవ్యోల్బణం కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇదే క్రమంలో ఐటీ రంగం సైతం డిమాండ్ తగ్గుదలను కొంత మేర చూడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ఐటీపై ఖర్చులను చాలా సంస్థలు ప్రస్తుతం తగ్గించుకోవటం ప్రతికూలంగా మారాయి.


Click it and Unblock the Notifications