Inequality: భారీగా పెరిగిన ఆర్థిక అసమానతలు.. 40 శాతం సంపద వారి దగ్గరే..
Income tax: అనాది కాలంగా దేశంలో అసమానతలకు కొదువ లేదు. అందుకే పంచవర్ష ప్రణాళికల ప్రారంభం నుంచి పేదరిక నిర్మూలనకు పెద్దపీట వేశారు. అయితే అవి అనుకున్న మేర సక్సెస్ కాలేదు. కాగా 20వ శతాబ్ధం ప్రారంభం నుంచి ఈ అసమానతలు మరింత పెరిగినట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
'ఇండియాలో ఆదాయం మరియు సంపద అసమానతలు 1922-2023: ది రైజ్ ఆఫ్ ది బిలియనీర్ రాజ్' పేరిట ఓ పేపర్ రిలీజ్ అయింది. థామస్ పికెట్టీ (పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ వరల్డ్ అసమానతల ల్యాబ్), లూకాస్ ఛాన్సెల్ (హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ మరియు వరల్డ్ అసమానత ల్యాబ్) మరియు నితిన్ కుమార్ భారతి (న్యూయార్క్ విశ్వవిద్యాలయం మరియు ప్రపంచ అసమానత ల్యాబ్)లు జరిపిన అధ్యయనం ఫలితాలను ఈ పేపర్‌లో పొందుపరిచారు.

దాని ప్రకారం.. 2014-15 మరియు 2022-23 మధ్య సంపద కేంద్రీకరణ వల్ల అసమానతలు భారీగా పెరిగాయి. 2022-23లో దేశంలోని టాప్ 1 శాతం కుబేరుల ఆదాయం మరియు సంపద వాటా వరుసగా 22.6, 40.1 శాతం చొప్పున వృద్ధి చెందింది. ఎంతగా అంటే భారతదేశపు టాప్ 1 శాతం ఆదాయ వాటా దక్షిణ ఆఫ్రికా, బ్రెజిల్, అమెరికాతో పాటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది.
ఇక్కడి ఆదాయపు పన్ను వ్యవస్థ ఇందుకు కారణం కావచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆదాయం మరియు సంపద రెండింటినీ పరిగణనలోకి తీసుకునేలా పన్ను కోడ్ పునర్నిర్మాణం జరగాలని సూచించారు. ఆరోగ్యం, విద్య మరియు పోషకాహారం పొందడంలో ప్రభుత్వం విస్తృతంగా పెట్టుబడులు పెట్టాలన్నారు. ప్రపంచీకరణ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్నత వర్గాలే కాకుండా సగటు భారతీయుడు అర్ధవంతంగా ప్రయోజనం పొందే విధంగా పాలసీలు రూపొందించాలని అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications