For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budget 2020: స్వాగతించిన పరిశ్రమ వర్గాలు!

|

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన 2020 బడ్జెట్ ను భారత పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. దూరదృష్టి తో కూడిన సమ్మిళిత బడ్జెట్ అని అవి కొనియాడాయి. కొన్ని అంశాల్లో కొంత నిరాశకు లోనయినా స్థూలంగా బడ్జెట్ చాలా బాగుందని పేర్కొన్నాయి. ఈ మేరకు అటు దేశవ్యాప్త ఇండస్ట్రీ అసోసోసియేషన్స్, ఇటు రాష్ట్రంలోని పరిశ్రమ వర్గాలు కూడా స్పందించాయి.

Budget 2020 : ఆదాయ పన్ను రేట్లు తగ్గింపు.. కానీ మెలిక పెట్టిన సీతారామన్

ఆర్థిక వృద్ధికి ఊతం: సిఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్
ఆర్థిక మంత్రి ఒకవైపు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఊతమిచ్చే నిర్ణయాలు ప్రకటిస్తూనే... మరో వైపు ద్రవ్య విధానాన్ని సరిగ్గా బాలన్స్ చేయగలిగింది. నిజానికి ఆర్థిక మంత్రి చాలా క్లిష్టమైన దారిలో పయనిస్తూనే ప్రభుత్వ వ్యయం పెరిగేలా చర్యలు తీసుకున్నారు. ఇది భారత్ లో పెట్టుబడులు పెరిగేందుకు, వినియోగం పెరిగేందుకు దోహదపడుతుంది. ఎఫ్ ఆర్ బీ ఎం విషయంలోనూ సరైన మోతాదులో క్రమశిక్షణ పాటిస్తూనే ఈ విధమైన నిర్ణయాలు ప్రకటించటం విశేషం.వ్యవసాయ రంగంలో రిఫార్మ్స్ తీసుకొచ్చేందుకు అధునాతన చట్టాలను అమలు చేసే రాష్ట్రాలకు చేయూత నిచ్ఛే అంశాలు బాగున్నాయి. దీంతో రైతులకు మెరుగైన రాబడికి హామీ లభించటంతో పాటు, వ్యవసాయంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం పెరుగుతుంది.

 Industry bodies positively responded on the Union Budget 2020

మౌలిక సదుపాయాల రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత కొనియాడదగింది. ఇది దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను పెంచటంతో పాటు ఉత్పాదకతను, వ్యాపారాల సమర్థను పెంపొందిస్తుంది. మౌలిక రంగంలో రూ 1,03,000 కోట్ల పెట్టుబడులు, సావరిన్ వెల్త్ ఫండ్స్ పెట్టె పెట్టుబడులపై 100% ఇంటరెస్ట్, డివిడెండ్, కాపిటల్ గెయిన్స్ పన్ను రద్దు ఈ రంగానికి భారీ ఊతమిస్తుంది. తయారీ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత కూడా చెప్పుకోదగ్గది. ఈ రంగంలో కొత్త కంపెనీలకు కేవలం 15% పన్ను దేశంలో మేక్ ఇన్ ఇండియా కు ఊతమివ్వగలదు.

ఇండియా, ఇండస్ట్రీ, ఇండివిడ్యుల్ అందరికీ: ఫిక్కీ చైర్మన్ సంగీత రెడ్డి
నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టిన 2020 బడ్జెట్ ... ఇండియా, ఇండస్ట్రీ, ఇండివిడ్యుల్ అందరికీ ఊతమిచ్చేలా ఉంది. అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలోనూ ఇది సమగ్ర బడ్జెట్ అనే చెప్పాలి. దేశానికి అవసరమైన సమయంలోనే ద్రవ్య లోటు విషయంలోనూ కొంత సడలింపునిచ్చి సరైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ప్రజల చేతిలోకి మరింత ద్రవ్యం చేరుతుందని, అది వినియోగాన్ని పెంచుతుందని చెప్పొచ్చు. సహజంగానే అది పరిశ్రమ వృద్ధికి కూడా దోహదం చేయగలదు. మౌలిక రంగం, వ్యవసాయం మెరుగైన వృద్ధికి చోదకాలుగా పనిచేస్తాయి. వ్యక్తిగత ఆదయ పరిమితిలో సడలింపులు, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, మౌలిక రంగం ఇలా అన్నిటికీ అవసరమైన మేరకు మద్దతు ఇవ్వటం నిజంగా అభినందనీయం. ప్రజల చేతిలోకి అధిక నగదు చేరితే అది ఆర్థికాభివృద్ధికి సోపానం అవుతుంది.

మంచి నిర్ణయాలు: ఎఫ్టీసిసిఐ ప్రెసిడెంట్ కరుణేంద్ర జాస్తి
ఎంఎస్ఎంఈ లకు ఊరటనిచ్చే అంశాలు కూడా ఈ బడ్జెట్లో ఉన్నాయి. తప్పనిసరి ఆడిట్ పరిధి లో ఉండే కంపెనీల టర్నోవర్ పరిమితిని రూ 1 కోటి నుంచి రూ 5 కోట్లకు పెంచటం మంచి నిర్ణయం. కంపెనీలకు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ తొలగించటం, చిన్న తరహా ఎన్బీఎఫ్సి కంపెనీలను కూడా సర్ఫేసి ఆక్ట్ పరిధిలోకి తీసుకురావటం, అలాగే వాటి రుణ మొత్తాన్ని రూ 1 కోటి నుంచి రూ 50 లక్షలకు తగ్గించటం వంటి నిర్ణయాలు ఇండస్ట్రీ కి మేలు చేస్తాయి. పరిశ్రమల అభివృద్ధికి రూ 27,300 కోట్లు కేటాయించటం కూడా చాలా మంచి నిర్ణయం.

రియల్ ఎస్టేట్ పై ప్రత్యేక ప్రభావం లేదు: జెఎల్ఎల్ కంట్రీ హెడ్ రమేష్ నాయర్
ప్రస్తుత బడ్జెట్ ప్రతిపాదనలు రియల్ ఎస్టేట్ రంగంపై భారీ స్థాయిలో ప్రత్యక్ష ప్రభావం పెద్దగా చూపవని చెప్పొచ్చు. అందుబాటు ధర గృహాలు, మౌలికసదుపాయాల కల్పన, పట్టణ వసతుల కల్పన, లాజిస్టిక్స్ వంటి రంగాలకు అధిక ప్రాధాన్యం దక్కింది. ప్రజల చేతిలో అధిక మొత్తంలో నగదు అందుబాటులో ఉండేలా నిర్ణయాలు ఉన్నాయి. ఇవి వినియోగ డిమాండ్ పెరిగేందుకు పనికొస్తాయి. సహజంగానే రియాల్టీ కి కూడా కొంత వరకు ఊరటనివ్వగలవు.

English summary

Budget 2020: స్వాగతించిన పరిశ్రమ వర్గాలు! | Industry bodies positively responded on the Union Budget 2020

Industry bodies positively responded on the Union Budget 2020 as there were several measures including emphasis for infrastructure, agriculture etc. While maintaining fiscal balance, they lauded the finance minister for her allocations to infrastructure and relaxing individual taxes which can improve consumption while boost investments in the country.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X