RBI Monetary Policy: రెపో రేటు ప్రకటనపై నిపుణుల మాట ఇదే.. ఊరట లభిస్తుందా..?
RBI Monetary Policy: దేశంలోని కార్పొరేట్ల నుంచి సామాన్యుల వరకు ఈరోజు అందరి చూపు రిజర్వు బ్యాంక్ మానిటరీ పాలసీపైనే ఉంది. అయితే రేట్ల ప్రకటనపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంది.
జూన్ 8న జరుగుతున్న ఆర్‌బీఐ రెపో రేటును 6.5% వద్ద హోల్డ్‌లో ఉంచుతుందని ఆశిస్తున్నట్లు భారత ఆర్థికవేత్త అభిషేక్ గుప్తా అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో రిజర్వు బ్యాంక్ ద్రవ్యోల్బణం అంచనాలను 5.2 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తుందని డ్యుయిష్ బ్యాంక్ AG ఆర్థికవేత్త కౌశిక్ దాస్ అభిప్రాయపడ్డారు. అలాగే వృద్ధి అంచనాలను 6.5 శాతం వద్ద కొనసాగిస్తుందని అన్నారు.

బలమైన GDP డేటా, తగ్గుతున్న ద్రవ్యోల్బణాన్ని రిజర్వు బ్యాంక్ ప్రతినిధుల బృందం పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉందని ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ బాగ్లా అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో మార్కెట్లోని ట్రేడర్లు రిజర్వు బ్యాంక్ నిర్ణయ ప్రకటన అనుగుణంగా ముందుకు సాగేందుకు వేచిచూస్తున్నారని వెల్లడించారు. రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్ల విషయంలో యథాతథస్థితిని కొనసాగిస్తుందని సిగ్నేచర్ గ్లోజర్ స్థాపకుడు ప్రదీప్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన 7.2 శాతం పటిష్టమైన GDP వృద్ధి రేటు ప్రపంచ సవాళ్లను ఎదుర్కొని దోహదపడుతుందని ఇండియా.కామ్ సీఈవో ధృవ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. రేట్ల పెంపు ఉండదంటూనే.. నిర్మాణం, వాణిజ్యం, హాస్పిటాలిటీ రంగాలు గణనీయమైన రెండంకెల వృద్ధిని సాధించాయన్నారు. రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం మద్దతును అందించడం కొనసాగించిందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications