Crude Oil: లీటర్ క్రూడ్ ఆయిల్ రూ.12కే..! ప్రభుత్వానికి అనిల్ అగర్వాల్ సూచన..

Anil Agarwal: పెట్రోలియం అవసరాల కోసం భారత్ అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీని వల్ల అనేక రంగాల్లో నష్టపోవాల్సి వస్తోంది. తాజాగా డాలర్‌తో రూపాయి మారకపు విలువ కనిష్ఠాలను చేరుకుంటూ.. మొదటిసారిగా 80 దాటింది. దీనికి ముడి చమురు కూడా కారణంగా ఉంది. దీనిపై ప్రముఖ వ్యాపారవేత్త వేదాంత లిమిటెడ్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ భారత ప్రభుత్వానికి ఒక సూచన చేశారు. కేంద్రం అంగీకరిస్తే ముడి చమురు దిగుమతిపై 75 శాతం వరకు ఆదా చేయవచ్చు.

వాణిజ్య లోటు..

వాణిజ్య లోటు..

ఈ మేరకు అనిల్‌ అగర్వాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. చమురు అన్వేషణ, ఉత్పత్తిలో ప్రైవేట్ రంగానికి ప్రభుత్వం మరింత భాగస్వామ్యాన్ని అంగీకరించాలన్నారు. దీని వల్ల భారత్ స్వయంగా చమురు ఉత్పత్తి చేయగలదని అనిల్ అగర్వాల్ అన్నారు. దేశంలోని సహజ వనరులను గరిష్ఠంగా వినియోగించేందుకు ప్రైవేట్ రంగం ఎక్కువగా భాగస్వామ్యం కావాలని అన్నారు. ఇంధనం, బొగ్గు లాంటివి ఎక్కువగా దిగుమతి వల్ల వాణిజ్య లోటు పెరుగుతోంది.

 దేశీయ ముడి చమురు చాలా చౌక..

దేశీయ ముడి చమురు చాలా చౌక..

ప్రస్తుతం.. భారత్ సగటున బ్యారెల్‌కు 100 డాలర్ల చొప్పున ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఒక బ్యారెల్‌లో దాదాపు 159 లీటర్ల ముడి చమురు ఉంటుంది. ఈ విధంగా.. దిగుమతి చేసుకుంటున్న చమురు లీటరకు రూ.50 ఖర్చవుతోంది. అదే దేశీయంగా ఉత్పత్తి చేస్తే కేవలం 25 డాలర్లకే బ్యారెల్ చమురు తయారు చేయవచ్చని అనీల్ అగర్వాల్ అంటున్నారు. అంటే ఈ లెక్కన లీటరుకు రూ.12 వెచ్చిస్తే సరిపోతుంది. దీని వల్ల దేశంలోని ప్రజలకు డీజిల్-పెట్రోలు చౌకగానే అందుబాటులోకి వస్తాయి.

ప్రభుత్వానికి ప్రయోజనాలు..

ప్రభుత్వానికి ప్రయోజనాలు..

కెయిర్న్ సంస్థ ప్రభుత్వానికి బ్యారెల్‌ చమురు 26 డాలర్ల చొప్పున ఇస్తున్నట్లే.. భారత్ కూడా ఒక్క వంతు ఖర్చుతో ముడి చమురు ఉత్పత్తి చేయవచ్చని అగర్వాల్ అన్నారు. దేశంలోని సంప్రదాయ పరిశ్రమలు, స్టార్టప్‌లను ప్రోత్సహించటం వల్ల భారీగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు. పైగా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

 దిగుమతి బిల్లులు..

దిగుమతి బిల్లులు..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలతో చమురు-గ్యాస్‌ను అన్వేషించేలా ఈ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆయన అన్నారు. భారతదేశం భారీ లోహాలు, ఖనిజాల ఉన్నప్పటికీ.. తాము భారీగా దిగుమతి బిల్లులను చెల్లించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

 ఇంధన భద్రత..

ఇంధన భద్రత..

ఇంధన భద్రతపై భారత్ తక్షణమే కృషి చేయాలని అనిల్ అగర్వాల్ వాదించడం ఇదే మొదటిసారి కాదు. బొగ్గు తవ్వకాలను ఓపెన్ చేయాలని, ప్రైవేట్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వాలని ఆయన వాదిస్తున్నారు. ఆయన తాజా ప్రకటనలో.. 'దేశీయ ఉత్పత్తి బాగా ఉంటే.. సంక్షోభ సమయంలో దేశాన్ని ఇవి కాపాడతాయని, ప్రజలకు ఉద్యోగాలతో శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది' అని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+