న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (IIP) గత ఎనిమిది సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా కనిష్టస్థాయికి పడిపోయింది. సెప్టెంబర్ నెలలో మైనస్ 4.3 శాతం నమోదయింది. క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మౌలిక నిర్మాణ రంగాల వృద్ధి మందగించడం ఇందుకు ముఖ్య కారణం. 2011-12లో సెప్టెంబర్ వృద్ధి అత్యల్పంగా నమోదయింది. 2018 సెప్టెంబర్ నెలలో 4.6 శాతం వృద్ధి సాధించింది. గత ఏడాది ఏప్రిల్ - సెప్టెంబర్ కాలంలో 5.2 శాతం వృద్ధి నమోదు కాగా, ఈ ఏడాది 1.3 శాతానికి తగ్గింది.
గత ఎనిమిదేళ్లలో పారిశ్రామికోత్పత్తి సూచీ ఈ స్థాయికి క్షీణించడం ఇదే తొలిసారి. 2011 అక్టోబర్ నెలలో -5% పతనం కాగా, ఇప్పుడు -4.3గా ఉంది. ఈ ఏడాది ఆగస్ట్ నెలలోను -1.4 శాతానికి పతనమైంది. ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో ఐఐపీ -0.4 శాతానికి తగ్గింది. ఏప్రిల్ - జూన్ కాలంలో 3 శాతంగా ఉంటే గత ఏడాది జూలై-సెప్టెంబర్ కాలంలో 5.3 శాతంగా ఉంది. వ్యవసాయం, వ్యవసాయేతర రంగాల్లో రైతులు, కార్మికుల ఆదాయం పెరగాల్సి ఉందని, అప్పుడు వినిమయం పెరుగుతుంది.

క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి సెప్టెంబర్ నెలలో-20.7 శాతం పతనమైంది. గత ఏడాది 6.9% వృద్ధిని నమోదు చేసింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ -9.9%, మౌలిక-నిర్మాణ రంగ వస్తువుల ఉత్పత్తి -6.4% పడిపోయాయి. ప్రత్యక్ష, పరోక్ష కారకాలైన ఇంటర్మీడియెట్ వస్తువుల విభాగంలో ఉత్పత్తి ఏడు శాతం పెరిగింది. IIP గణాంతాల తీరును బట్టి ఈసారీ జీడీపీ భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2019-20 మొదటి క్వార్టర్‌లో జీడీపీ వృద్ధి ఆరేళ్ల కనిష్ఠానికి (5 శాతం) పడిపోయింది. ఆ తర్వాత కాలంలో మరింత తగ్గిన పారిశ్రామికోత్పత్తి, కీలక రంగాల వృద్ధి గణాంకాలను బట్టి చూస్తే జూలై-సెప్టెంబరు కాలానికి జీడీపీ మరింత జారుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications