ప్లీజ్ ఇన్వెస్టర్స్.. షేర్లు అమ్మెుద్దంటూ బతిమాలుతున్న కంపెనీ.. నేడు 28% ఢమాల్..!!

Indusind Bank: దేశంలోని టాప్-5 ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటిగా ఉన్న ఇండస్ఇండ్ బ్యాంక్ పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం బాగోలేదు. డెరివేటివ్ కాంట్రాక్ట్స్ వల్ల సుమారూ రూ.1,500 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని బ్యాంక్ వెల్లడించటంతో పెట్టుబడిదారుల్లో అలజడి మెుదలైంది. ప్రస్తుతం స్టాక్ గత 5 ట్రేడింగ్ సెషన్ల నుంచి పతనాన్ని కొనసాగించటంతో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సైతం అప్రమత్తం అవుతున్నాయి. భారీ నష్టాలను తగ్గించుకోవాలని చూస్తున్నాయి.

నేడు ఇంట్రాడేలో ఇండస్ఇండ్ బ్యాంక్ కంపెనీ షేర్ల ధర ఏకంగా 28 శాతం భారీ పతనాన్ని చూసింది. ఇది బ్యాంక్ గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో నమోదు చేసిన నష్టానికి సరిసమానమైనది. దీంతో బ్యాంకింగ్ సంస్థ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడిని చూశాయి. రిటైల్ పెట్టుబడిదారుల నుంచి మ్యూచువల్ ఫండ్స్ వరకు అందరూ షేర్లను విక్రయిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్స్ రూ.6,000 కోట్లకు పైగా గణనీయంగా తగ్గాయని వెల్లడైంది. నేటిత పతనంతో కంపెనీ షేర్లు ఒక్కోటి మార్చి తర్వాత అతిపెద్ద పతనాన్ని నమోదు చేయటంతో పాటు 2020 నవంబర్ తర్వాత కనిష్ఠాలకు చేరుకుంటున్నాయి.

Indusind Chairman requests Investors stay strong and not to sell bank stock in hurry

ఇదిలా ఉండగా ప్రస్తుత పరిస్థితులతో పెట్టుబడిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ చైర్మన్ అశోక్ హిందూజా అన్నారు. ఇలాంటి సంక్షోభాలు సహజమేనని పెట్టుబడిదారులు ఓపికగా ఉండాలని ఆయన సూచించారు. గత మూడు త్రైమాసికాల్లో కంపెనీ రూ.11 వేల కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించిందని ఇలాంటి పరిస్థితుల్లో రూ.1600 కోట్ల నష్టాన్ని భరించటం పెద్ద విషయం కాదని ఇన్వెస్టర్లకు చెప్పారు. ఈ సమస్యలను యాజమాన్యం గుర్తించిందని, ఆడిటర్లు కాదని తమ పారదర్శకత, నిబద్ధతను మార్కెట్లు అభినందించాలని కోరారు.

ఇటీవల బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తన ఫ్యూచర్స్-ఆప్షన్స్ పోర్ట్‌ఫోలియోకు సంబంధించిన ప్రక్రియల అంతర్గత సమీక్షలో కొన్ని వ్యత్యాసాలను కనుగొన్నట్లు తెలపటంతో సమస్య పెద్దదిగా మారింది. డిసెంబర్ 2024 నాటికి బ్యాంక్ అంతర్గతంగా నిర్వహించి రివ్యూ ప్రకారం గరిష్ఠంగా 2.35 శాతం నికర విలువ ప్రభావితం కావొచ్చని అంచనా వేసింది. ఇదే సమయంలో బ్యాంక్ దీనిని అంచనా వేయటానికి ఏకకాలంలో మరో ఇండిపెండెంట్ ఏజెన్సీకి కూడా దీనిని పరిశీలించి తమ అభిప్రాయాన్ని వెల్లడించనుంది. అయితే ఇప్పటి వరకు బయటి ఏజెన్సీ తన రిపోర్టును అందించలేదు. బ్యాంక్ సైతం ఎలాంటి ఫైండింగ్స్ ఉంటాయి, అవి బ్యాంకుపై ఎంత మేరకు ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయనే అంశంపై అందరి ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.

ఈ వ్యవహారంపై దేశంలో 5వ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ రెగ్యులేటరీకి మార్చి 10, 2025న సమాచారం అందించింది. అయితే ప్రస్తుతం బ్యాంక్ పూర్తి ఆరోగ్యంగా ఉందని, ట్రేడ్ వల్ల కలిగే నష్టాలను గ్రహించటానికి లాభాలు, క్యాపిటల్ రిజర్వ్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.అయితే ఈ ట్రేడ్స్ గత ఆర్థిక సంవత్సరానికి 5-7 ఏళ్ల పూర్వకాలానికి చెందినవిగా తెలుస్తోంది. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం కంపెనీ మరో యెస్ బ్యాంక్ లాంటి పతనానికి దారితీస్తుందా అనే ఆందోళనలో ఉన్నారు. ఒకప్పుడు యాజమాన్యం చేసిన తప్పుల కారణంగా యెస్ బ్యాంక్ ఎలా కుప్పకూలిందో మనందరికీ తెలిసిందే.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+