IndusInd Bank Sink: వరుసగా గడచిన రెండు రోజులుగా ఇండస్ఇండ్ బ్యాంక్ భారీ పతనాన్ని చూస్తోంది. ఈ క్రమంలో నేడు స్టాక్ మరో 20 శాతం మేర పడిపోయింది. దీంతో నేడు ఎన్ఎస్ఈలో స్టాక్ ధర రూ.180 క్షీణించి రూ.720.35 వద్ద లోయర్ సర్క్యూట్ లో లాక్ అయ్యింది. దీంతో నేడు కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.56,770 కోట్లకు చేరుకుంది. దీంతో కంపెనీ షేర్లు నేడు ఇంట్రాడేలో తమ 52 వారాల కనిష్ఠాన్ని నమోదు చేశాయి.
వాస్తవానికి ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో టాప్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతున్న ఇండస్ఇండ్ బ్యాంక్ తన డెరివేటివ్ అకౌంట్స్ కారణంగా నికర విలువ 2.35 శాతం మేర క్షీణతను చూడవచ్చని హెచ్చరించింది. దీంతో స్టాక్ మార్కెట్లో పెద్ద అలజడి మెుదలైంది. అప్రమత్తమైన పెట్టుబడిదారులు కంపెనీ షేర్లను విక్రయిస్తున్నారు. వాస్తవానికి కంపెనీ అంచనా ప్రకారం దాని నికర విలువ దాదాపు రూ.1,500 కోట్ల మేర తగ్గవచ్చని వెల్లడైంది. డిసెంబర్ 2024 నాటికి దాని నికర విలువలో 2.35% తగ్గుదల ఉంటుందని అంచనా వేసింది.

డిసెంబర్ 2024 నాటికి బ్యాంక్ అంతర్గతంగా నిర్వహించి రివ్యూ ప్రకారం గరిష్ఠంగా 2.35 శాతం నికర విలువ ప్రభావితం కావొచ్చని అంచనా వేసింది. ఇదే సమయంలో బ్యాంక్ దీనిని అంచనా వేయటానికి ఏకకాలంలో మరో ఇండిపెండెంట్ ఏజెన్సీకి కూడా దీనిని పరిశీలించి తమ అభిప్రాయాన్ని వెల్లడించనుంది. అయితే ఇప్పటి వరకు బయటి ఏజెన్సీ తన రిపోర్టును అందించలేదు. బ్యాంక్ సైతం ఎలాంటి ఫైండింగ్స్ ఉంటాయి, అవి బ్యాంకుపై ఎంత మేరకు ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయనే అంశంపై అందరి ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.
ఈ వ్యవహారంపై దేశంలో 5వ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ రెగ్యులేటరీకి మార్చి 10, 2025న సమాచారం అందించింది. అయితే ప్రస్తుతం బ్యాంక్ పూర్తి ఆరోగ్యంగా ఉందని, ట్రేడ్ వల్ల కలిగే నష్టాలను గ్రహించటానికి లాభాలు, క్యాపిటల్ రిజర్వ్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.అయితే ఈ ట్రేడ్స్ గత ఆర్థిక సంవత్సరానికి 5-7 ఏళ్ల పూర్వకాలానికి చెందినవిగా తెలుస్తోంది. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం కంపెనీ మరో యెస్ బ్యాంక్ లాంటి పతనానికి దారితీస్తుందా అనే ఆందోళనలో ఉన్నారు. ఒకప్పుడు యాజమాన్యం చేసిన తప్పుల కారణంగా యెస్ బ్యాంక్ ఎలా కుప్పకూలిందో మనందరికీ తెలిసిందే.
మెుత్తానికి గడచిన 5 ట్రేడింగ్ సెషన్లలో ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ ధర దాదాపు 27 శాతం పతనాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. వరుసగా బ్యాంకింగ్ రంగంలో ఇలాంటి ఘటనలు బ్యాంకులకు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవల బ్యాంక్ సీఎఫ్ఓ రాజీనామాతో పాటు సీఈవో గడువును కేవలం ఏడాది పెంచటం కూడా పెట్టుబడిదారులను ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది.


Click it and Unblock the Notifications