Interest Rates: వడ్డీ రేట్లు పెంచిన ఆ రెండు బ్యాంకులు
దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి 2022 సంవత్సరంలో మే నుంచి రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచుతూ వస్తుంది.
ఆర్బీఐ ఈ సంవత్సరం ఇప్పటి వరకు మొత్తం 5 సార్లు రెపో రేటు పెంచింది. ఈ ఏడాది రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు దాదాపు 2.25 శాతం పెరిగింది. చివరిసారిగా డిసెంబర్ 7, 2022న రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 0.35 శాతం పెంచిన విషయం తెలిసిందే..

వడ్డీ రేట్లు
ఆర్బీఐ రెపో రేటు పెంచడంతో చాలా బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లు పెంచాయి. ఇప్పటికే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి. తాజాగా ఇండస్ఇండ్ బ్యాంక్, RBL బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచాయి . ఈ రెండు బ్యాంకులు తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ ఆధారిత రుణ రేటును పెంచాయి. రెండు బ్యాంకుల కొత్త MCLR ఎంత పెరిగింది. కొత్త రేట్లు ఎప్పటి నుండి అమలులోకి వచ్చాయో చూడండి.

ఇండస్‌ఇండ్
ఇండస్‌ఇండ్ MCLRని 5 నుంచి 15 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రుణాలు తీసుకున్న వారిపై భారం పడే అవకాశం ఉంది. వడ్డీ రేటు పెంపుతో EMI భారం పెరుగుతుంది. బ్యాంక్ కొత్త రేట్లు డిసెంబర్ 22, 2022 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ బ్యాంకు రుణాలపై 8.80 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ బ్యాంకు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల MCLR 10.15 శాతానికి పెంచింది.

RBL
RBL బ్యాంక్ కూడా వడ్డీ రేట్లు పెంచింది. LCLR ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం RBL బ్యాంక్ ఓవర్‌నైట్ MCLR 8.70 శాతానికి చేరుకుంది. కాగా, 1 నెల MCLR 8.80 శాతానికి, 3 నెలల MCLR 9.10 శాతానికి, 6 నెలల MCLR 9.50 శాతానికి 1 సంవత్సరం MCLR 9.90 శాతానికి తగ్గించింది.


Click it and Unblock the Notifications