Indusind Bank: ఉపయోగించిన సెకండ్ హ్యాండ్ కార్లు కొనేవారు ఎక్కువగా బయటి ఫైనాన్స్ లపై ఆదారపడుతుంటారు. దీనివల్ల కారుకు చెల్లించే మెుత్తంపై వడ్డీ భారం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రైవేటు రంగంలోని బ్యాంకింగ్ దిగ్గజం ఇండస్‌ఇండ్ బ్యాంక్ ముందుకొచ్చింది. ఇలా 100 శాతం పేపర్‌లెస్ లోన్‌లను అందించడానికి Rupyyతో భాగస్వామిగా ఉంది.

భాగస్వామ్యం ప్రకటన..
ప్రస్తుత డిజిటల్ యుగంలో వేగంగా, 100 శాతం పేపర్‌లెస్ లోన్ ప్రాసెసింగ్ అందిస్తున్న ప్లాట్‌ఫారమ్ అయిన 'Rupyy'తో ఇండస్‌ఇండ్ బ్యాంక్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సోమవారం ఆగస్టు 1న ప్రకటించింది. రూపీ అనేది జైపూర్ ఆధారిత గిర్నార్‌సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఫిన్‌టెక్ సంస్థ. దీనికి కార్‌దేఖో, బైక్‌దేఖో, జిగ్‌వీల్స్, పవర్‌డ్రిఫ్ట్ మొదలైన బ్రాండ్‌లను కలిగి ఉంది.

వేగంగా లోన్స్..
ఈ డీల్ కారణంగా ఈజీ డాక్యుమెంటేషన్, ఫాస్ట్ లోన్ ప్రాసెసింగ్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ కస్టమర్‌లు ఇప్పుడు 'Rupyy'లో లావాదేవీలు చేస్తున్నప్పుడు సౌకర్యవంతమైన రీపేమెంట్ ఆప్షన్‌లను ఎంచుకోవచ్చు. ఈ ప్రక్రియ కస్టమర్లకు సౌకర్యవంతంగా ఉంటుంది. కస్టమర్-ఫస్ట్ బ్యాంక్‌గా వారికి సంతోషకరమైన అనుభవాన్ని కలిగించేందుకు తాము కృషి చేస్తున్నట్లు బ్యాంక్ కన్స్యూమర్ ఫైనాన్స్ విభాగం హెడ్ AG శ్రీరామ్ పేర్కొన్నారు.

డిజిటల్ ఎకానమీ..
ఇండస్‌ఇండ్ బ్యాంక్ డిజిటల్ ఎకానమీకి మారడాన్ని వేగవంతం చేసే వినూత్న ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టిఎ రాజగొప్పలన్ తెలిపారు. వెహికల్ ఫైనాన్స్ సెగ్మెంట్‌లో తమ దశాబ్దాల నిపుణతతో పాటు రూపీ కొత్త-యుగం డిజిటల్ సేవలు కస్టమర్లకు మరింత చేరువ చేస్తుందని అన్నారు. కస్టమర్ల కోసం మంచి స్కీమ్స్ ప్రవేశపెట్టనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications