IndusInd bank: అంచనాలు మించి ఇండస్ ఇండ్ బ్యాంక్ Q4 ఫలితాలు.. 50 శాతం నికర లాభంతో డివిడెండ్ కు రెడీ
IndusInd bank: ఇండస్ ఇండ్ బ్యాంక్ తన Q4 ఫలితాలను వెల్లడించింది. 2022-23 మార్చి త్రైమాసికంలో 2 వేల 40 కోట్ల స్టాండ్ ఎలోన్ నికర లాభంతో అంచనాలను బీట్ చేసింది. గతేడాదితో 1,361.37 కోట్లతో పోలిస్తే దాదాపు 50 శాతం పెరుగుదల నమోదు కావడం విశేషం. అయితే బ్రోకరేజీలు బాటమ్ లైన్ లో సంవత్సరానికి 43.3 శాతం పెరుగుదలను మాత్రమే అంచనా వేశాయి.
బ్యాంకు నికర వడ్డీ ఆదాయం దాదాపు 4 వేల 700 కోట్లు కాగా, సంవత్సరానికి 17 శాతం వృద్ధిని కనబరిచింది. తదుపరి వార్షిక సర్వసభ్య సమావేశంలో ఒక్కో షేరుకు రూ.14 చొప్పున డివిడెండ్ చెల్లించాలని బోర్డు సిఫార్సు చేసింది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే బ్యాంకు ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. స్థూల మరియు నికర NPAలు వరుసగా 1.98 శాతం, 0.59 శాతానికి మెరుగుపడ్డాయి.

కంపెనీ రిటైల్ వ్యాపారాల ద్వారా రుణ వృద్ధిని వేగవంతం చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. తద్వారా రిటైల్ రుణాలు 7 శాతం పెరిగినట్లు పేర్కొంది. QoQలోనూ ఈ రుణాల వాటా 54 శాతానికి మెరుగుపడినట్లు చెప్పింది. 7 శాతం QoQ వద్ద మిడ్ & స్మాల్ కార్పోరేట్ మరియు 5 శాతం QoQ వద్ద లార్జ్ కార్పొరేట్ విభాగాల్లోనూ వృద్ధి ఉన్నట్లు స్పష్టం చేసింది.
నికర వడ్డీ మార్జిన్లు 8 బేసిస్ పాయింట్లు YoYలో మరియు 1 బేసిస్ పాయింట్లు QoQలోనూ పెరిగి 4.28 శాతంగా ఉన్నాయి. ఆస్తులపై రాబడి (RoA) కూడా 39 బేసిస్ పాయింట్లు YoY మరియు 3 బేసిస్ పాయింట్లు QoQ వృద్ధితో 1.90 శాతానికి మెరుగుపడింది. ప్రొవిజన్ కవరేజ్ నిష్పత్తి 71 శాతం మరియు మొత్తం రుణ సంబంధిత కేటాయింపులు GNPAలో 126 శాతంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications