IndusInd Bank Q1 Results: దేశీయ ప్రైవేటు సెక్టారు బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఇండస్ఇండ్ బ్యాంక్ తన క్యూ1 ఫలితాలను విడుదల చేసింది. ఇది నిపుణుల అంచనాలకు మంచి రాబడులను నమోదు చేసింది.
ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.2,124 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. ఇది క్రితం సంవత్సరంలోని రూ.1,631 కోట్లతో పోలిస్తే 33 శాతం అధికం. ఇది దాదాపు TV-18 పోల్ అంచనాకు అనుగుణంగా ఉంది. త్రైమాసికంలో ఆదాయం 28 శాతం పెరిగి రూ.12,939 కోట్లకు చేరుకుంది. ఇందులో రూ.5,863 కోట్ల నికర వడ్డీ ఆదాయం ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నివేదించబడిన రూ.4,125 కోట్లతో పోలిస్తే 18 శాతం ఎక్కువ.

గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 2.35 శాతం నుంచి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 1.94 శాతానికి తగ్గాయి. మరోవైపు త్రైమాసికంలో ఇండస్‌ఇండ్ బ్యాంక్ నికర NPA 0.58 శాతంగా ఉంది. ఇది ఏడాది ప్రాతిపదికన 0.67 శాతం నుంచి తగ్గి మెరుగుపడింది. Q1FY24 చివరిలో స్థూల NPA రూ.5,941 కోట్లుగా ఉంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.5,826 కోట్లతో పోలిస్తే ఇది 2 శాతం ఎక్కువ.
బాసెల్ III నిబంధనల ప్రకారం రుణదాత మూలధన సమృద్ధి నిష్పత్తి మొదటి త్రైమాసికంలో 18.04 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇది 17.86 శాతంగా ఉంది. జూలై 18న ట్రేడింగ్ సెషన్‌లో ఇండస్‌ఇండ్ షేర్లు బీఎస్‌ఈలో ఒక్కొక్కటి రూ.1,390.30 వద్ద ట్రేడింగ్ ముగించింది.


Click it and Unblock the Notifications