IndusInd Bank: ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెంచిన ఇండస్‌ఇండ్ బ్యాంక్..
ప్రైవేట్ రంగ బ్యాంక్ ఇండస్‌ఇండ్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ దారులకు శుభవార్త అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. బ్యాంకు రూ.1 నుంచి 5 కోట్ల డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రేట్లు 23 సెప్టెంబర్ 2022 నుంచి అమలులోకి వచ్చాయి.

4.45 శాతం
7 రోజుల నుంచి 61 నెలల FD 1 నుంచి 5 కోట్ల వరకు బ్యాంక్ 4.00% నుంచి 6.65% వరకు వడ్డీ రేటును అందిస్తోంది. 7 నుంచి 14 రోజుల FD-4శాతం, 15 నుంచి 30 రోజుల వరకు 4.10శాతం, 31 నుంచి 45రోజుల FDపై 4.35 శాతం వడ్డీ అందిస్తోంది. 46-60 రోజుల FDపై 4.45 శాతం ఇస్తోంది.

5.55శాతం వడ్డీ
61-90 రోజుల FDపై 4.6శాతం వడ్డీ ఇస్తున్నారు. 91-120 రోజుల FD - 5.15% 121-180 రోజుల FDలపై 5.25 శాతం వడ్డీ వస్తోంది. 181-210 రోజుల FDపై 5.40శాతం వడ్డీ ఇస్తోంది. 211-269 రోజుల FDపై 5.55శాతం వడ్డీని ఇస్తున్నారు. 270-354 రోజుల FD-5.90 శాతం వడ్డీ ఇస్తోంది.

7శాతం వడ్డీ
355-364 రోజుల FDపై-6.15 శాతం, 1 నుంచి 1 సంవత్సరం 6 నెలల FDపై 6.40శాతం వడ్డీ ఇస్తున్నారు. 1 సంవత్సరం 6 నెలల నుంచి 1 సంవత్సరం 7 నెలల FDలపై 7 శాతం వడ్డీ ఇస్తున్నారు. 1 సంవత్సరం 7 నెలల నుండి 2 సంవత్సరాల FDపై 7శాతం వడ్డీని చెల్లిస్తుంది.

వడ్డీ రేట్లు
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో ప్రపంచ రిజర్వ్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును నిరంతరం పెంచుతోంది. మే, జూన్, ఆగస్టు నెలల్లో బ్యాంక్ రెపో రేటును 4 శాతం నుంచి 5.40 శాతానికి పెంచింది. దీని కారణంగా, ఎఫ్‌డి రేట్లు, పొదుపు ఖాతాలు, ఆర్‌డి రేట్లు నిరంతరం పెరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications