రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కొత్త అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్‌వర్క్ కింద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్(FIP) సేవల్ని అందిస్తోన్న మొట్టమొదటి బ్యాంకుగా ఇండస్ఇండ్ బ్యాంకు నిలిచింది. డిజిసాహామతితో ముందుకు వచ్చింది. దేశంలోనే FIP ఈ సేవలను అందిస్తున్న తొలి బ్యాంకు తమదేనని బ్యాంకు గురువారం ప్రకటించింది. దీంతో వినియోగదారులు ఇప్పుడు వారి ఖాతాల స్టేట్‌మెంట్లు, ట్రాక్ డిపాజిట్లు, ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్స్ (షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సురెన్స్, ఈపీఎఫ్, పీపీఎఫ్), క్రెడిట్ కార్డులు పొందటం వంటి అనేక ప్రయోజనాలు పొందవచ్చును. తద్వారా కస్టమర్లు తమ ఆర్థిక అంశాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సింగిల్ విండో విధానం ఉపయోగపడుతుంది.

ఇది కీలకమైన అడుగు
ఆర్బీఐ తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల వ్యక్తులతో పాటు చిన్న, మధ్యతరహా వ్యాపారులు సేవలను పొందవచ్చు. ఇది వారి ఆర్థిక అవసరాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగేందుకు సహకరిస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంకు ఎప్పుడు కూడా కస్టమర్ సాధికారత కోసం సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణలపై దృష్టి సారించిందని ఇండస్ఇండ్ బ్యాంక్(కన్స్యూమర్ బ్యాంకింగ్ హెడ్) సౌమిత్ర సేన్ తెలిపారు. ఇందులో భాగంగా అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్‌వర్క్ కీలకమైన అడుగు అన్నారు. వివిధ బ్యాంకులు సహా ఇతర మార్గాల ద్వారా కస్టమర్లు తమకు నచ్చిన ఉత్పత్తి, సేవలను ఎంచుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.ఈ ప్రయాణంలో డిజిసాహామతి ఫౌండేషన్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నారు.
అకౌంట్ అగ్రిగేటింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను ఇండస్ఇండ్ బ్యాంకు స్వీకరించడంలో ఆశ్చర్యం లేదని, ఈ రంగంలో విభిన్నమైన, వినూత్నమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకు రావడానికి అవకాశాలు ఉన్నాయని డిజిసాహామతి సహవ్యవస్థాపకులు బిజి మహేష్ అన్నారు.

అకౌంట్ అగ్రిగేటర్ సిస్టం అందించే ప్రయోజనాలు
అకౌంట్ అగ్రిగేటర్ సిస్టం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుత ఫిజికల్ డాక్యుమెంట్ సబ్‌మిషన్ ప్రక్రియను తొలగిస్తుంది. దీనికి ఎంతో సమయం పోతోంది. ఈ పద్ధతి ద్వారా సమయం వృధా కాదు.వ్యక్తులు, ఎస్ఎంఈ కస్టమర్లు తమ ఆర్థిక సమాచారాన్ని డిజిటల్‌గా బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీ వంటి నియంత్రిత ఆర్థిక సంస్థలతో సురక్షిత చట్రంలో పంచుకోవచ్చు.సమాచారాన్ని పంచుకోవడానికి ముందు స్పష్టమైన సమ్మతి ద్వారా పంచుకున్న ఆర్థిక సమాచారంపై పూర్తి నియంత్రణ కలిగి ఉండేందుకు కస్టమర్‌కు అనుమతిస్తుంది.

ఇండస్ఇండ్ బ్యాంకు
ఇండస్ఇండ్ బ్యాంకు 1994లో కార్యకలాపాలు ప్రారంభించింది. 2020 జూన్ 30వ తేదీ నాటికి ఇండస్ఇండ్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 1911 బ్రాంచీలు, బ్యాంకింగ్ ఔట్‌లెట్స్ ఉన్నాయి. 751 ప్రాంతాల్లో 2,721 ఏటీఎంలు ఉన్నాయి. కాగా, ఇండస్ ఇండ్ బ్యాంకును కొటక్ మహీంద్ర బ్యాంకు అక్వైర్ చేసుకోనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఈ వార్తలను ఇండస్ఇండ్ బ్యాంకు కొట్టిపారేసింది. ఇప్పుడు బ్యాంకు కస్టమర్లు తమ ఆర్థిక సమాచారాన్ని అకౌంట్ అగ్రిగేటర్ ఎకోసిస్టం ద్వారా ఆర్థిక సమాచారాన్ని పంచుకోవడంలో సహకరించే పద్ధతిని తీసుకు వచ్చింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications