రంగంలోకి ఎయిర్‌టెల్.. ఇన్వెస్టర్ల ఆందోళనతో కుప్పకూలిన స్టాక్.. మీ దగ్గర ఉన్నాయా?
Indus Towers Stock: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇండస్ టవర్స్ లిమిటెడ్ కంపెనీ షేర్లు ఫోకస్‌లో కొనసాగుతున్నాయి. వాస్తవానికి వొడాఫోన్ సంస్థ తన టవర్స్ వ్యాపారంలో దాదాపు 20 శాతం విక్రయింటంతో పెద్ద ప్రకంపనలు నమోదయ్యాయి.
ఈ క్రమంలో భారీగా కంపెనీ షేర్లు నేడు చేతులు మారాయి. టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ నేడు ఇండస్ టవర్స్ కంపెనీలో 1 శాతం వాటాను కొనుగోలు చేయటం గమనార్హం. ఈ క్రమంలో టెలికాం దిగ్గజం ఏకంగా 2.695 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. అయితే దీనికి ముందు ఇండస్ టవర్స్ వ్యాపారంలో ఎయిర్ టెల్ 47.95 శాతం వాటాను హోల్డ్ చేస్తోంది. నేడు వొడాఫోన్ గ్రూప్ ఇండస్ టవర్స్ కంపెనీకి చెందిన 53.3 కోట్ల షేర్లను విక్రయించి రూ.17,065 కోట్లను సమీకరించింది. వోడాఫోన్ తన ఆర్థిక పరిస్థితులను క్రమబద్ధీకరించడానికి ఈ విక్రయం తీసుకుందని వెల్లడైంది.

అయితే నేడు ఇంట్రాడేలో ఇండస్ టవర్స్ కంపెనీ షేర్లు దాదాపు 6 శాతం క్షీణించాయి. బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్ గ్రూప్ ఇండస్ టవర్స్ కంపెనీలో దాదాపు 19 శాతం వాటాను బ్లాక్ డీల్ ద్వారా విక్రయించింది. అయితే బ్లాక్ డీల్ లావాదేవీకి ముందు, వోడాఫోన్ గ్రూప్ 567.2 మిలియన్ షేర్లను లేదా టవర్ కంపెనీలో 21% వాటాను కలిగి ఉంది. అదే సమయంలో బ్లాక్ డీల్ కోసం ధర బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.310-341 మధ్య నిర్ణయించబడింది.
వోడాఫోన్ గ్రూప్ 2022లో అప్పటికి 28% వాటాను విక్రయించే ఉద్దేశాన్ని ఇంతకుముందు ప్రకటించింది. దాని లక్ష్యం 42.17 బిలియన్ డాలర్ల నికర రుణాన్ని తగ్గించడంగా ఉంది. JP మోర్గాన్ విశ్లేషకులు కొత్త అమ్మకాలు గణనీయమైన నగదు ప్రవాహాన్ని సృష్టించవచ్చని ఒక నోట్‌లో తెలిపారు. ఇది ఇండస్ టవర్స్‌తో సహా విక్రేతలకు సత్వర రుణ చెల్లింపును సులభతరం చేస్తుంది. బ్లాక్ డీల్ కారణంగా ఇండస్ టవర్స్ స్టాక్ ధర నేడు ఇంట్రాడేలో 10 శాతం క్షీణతకు దారితీసింది. అయితే ఎయిర్ టెల్ స్టాక్ మాత్రం లాభపడింది. సాయంత్రం 2.45 గంటల సమయంలో ఇండస్ టవర్స్ షేర్ ధర ఎన్ఎస్ఈలో రూ.334 వద్ద 3 శాతం నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications